Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 22 April 2025
webdunia

01-04-2020 నుంచి 30-04-2020 వరకు మీ మాసగోచార ఫలాలు

Advertiesment
Monthly Horoscopes
, మంగళవారం, 31 మార్చి 2020 (19:07 IST)
మేషరాశి : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. 
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. గృహమార్పులు చేపడతారు. వ్యవహారానుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతనవుండదు. ఊహించని ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆత్మీయులను కలుసుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాతంగా సాగుతాయి. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. గృహమార్పు కలిసివస్తుంది. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ఖర్చులు విపరీతం. ఆదాయంపై దృష్టిపెడతారు. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు సానుకూలమవుతాయి. అవివాహితులకు శుభదాయకం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతి, అధికారులకు హోదా, మార్పు, స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సరకు నిల్వలో జాగ్రత్త. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
కుటుంబ విషయాలపై శ్రద్ధ అవసరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆహ్వానం అందుకుంటాు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధం మరోదానికి ఖర్చు చేస్తారు. సోదరులతో పట్టింపులెదుర్కొంటారు. సౌమ్యంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పదవులు దక్కకపోవచ్చు. ప్రత్యర్థులతో సమస్యలెదురవుతాయి. గుట్టుగా వ్యవహరించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులు మానసికంగా కుదుటపడతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం. పుష్యమి, అశ్లేష
ఈ మాసం అనుకూలదాయకమే. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆత్మీయుల సాయం అందిస్తారు. పనులు బాధ్యతలు అప్పగించవద్దు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. సందేశాలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. మీ సాయంతో ఒకరికి ఉన్నత అవకాశం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. అధికారులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
అన్నిరంగాల వారికి శుభయోగమే. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కివస్తాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అపరిచితులతో జాగ్రత్త. దంపతుల మధ్య దాపరికం తగదు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు, విశ్రాంతి అవసరం. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. సంతానం దూకుడును అదుపు చేయండి. వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు అభ్యంతరాలెదురవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. 
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. పదవులు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. సాధ్యంకాని హామీలివ్వవద్దు. ప్రత్యర్థులతో జాగ్రత్త. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం దూకుడు అదుపు చేయండి. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికం. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. అశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
వృశ్చిక రాశి : విశాఖ 4వ పాదం, అనూరధ, జ్యేష్ట
అన్ని రంగాల వారికి బాగుంటుంది. వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. అవకాశాలు కలిసివస్తాయి. మాట నిలబెట్టుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం గ్రహిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. నిర్మాణాలు, శంకుస్థాపనలకు అనుకూలం. బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం చదువులపై దృష్టిపెడతారు. సంస్థలు, పరిశ్రమల స్థాపనలకు అనుకూలం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు శుభయోగం, వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
ధనుర్‌రాశి : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
గృహమార్పు కలిసివస్తుంది. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కివస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. స్వయంకృషితో రాణిస్తారు. సంతానం కదలికలపై దృష్టిసారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదాపడతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉమ్మడి వ్యాపారాలు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవరణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆర్థికలావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలెదురవుతాయి. అప్రయత్నంగా వ్యవహరించాలి. సహాయం, సలహాలు ఆశించవద్దు. పనుల్లో ఆటంకాలు, చికాకులు అధికం. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ప్రకటనలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం దైవకార్యంలో పాల్గొంటారు. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
ఈ మాసం నిరాశాజనకం. సంప్రదింపులు సాగవు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దల సలాహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఆలోచనలతో సతమతమవుతారు. ఊహించని ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. మనోధైర్యంతో ముందుకుసాగండి. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారులు సామాన్యంగా సాగుతాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణం విరమించుకుంటారు. 
 
మీనరాశి : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వస్త్రప్రాప్తి, వాహనయోగం పొందుతారు. మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. కార్యక్రమాల్లో మార్పులుంటాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు వేగవంతమవుతాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. వ్యాపారాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వాణిజ్యం ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వేడుకలు, సన్మాన సభల్లో పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

31-03-2020 మంగళవారం దినఫలాలు - మహాలక్ష్మిని ఆరాధించినా..