Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

01-01-2020 నుంచి 31-01-2020 వరకు మీ మాస ఫలాలు

Advertiesment
01-01-2020 నుంచి 31-01-2020 వరకు మీ మాస ఫలాలు
, మంగళవారం, 31 డిశెంబరు 2019 (21:03 IST)
మేష రాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. 
వ్యవహారానుకూలత ఉంది. పెద్దల సలహా పాటిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రముఖులకు శుభాకాంక్షలు, కానుకలు అందిస్తారు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. గృహం సందడిగా ఉంటుంది. సంతానం దూకుడు అదుపుచేయండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను విశ్వసించవద్దు. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ధనయోగం, అధికారులకు కొత్త బాధ్యతలు. ప్రయాణం, దైవదర్శనాల్లో అవస్థలు తప్పవు. పోటీలు, పందాలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. రుణ విముక్తులవుతారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు విపరీతం. బాధ్యతగా వ్యవహరించాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. పనుల సానుకూలమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. నిరుద్యోగులకు అశాజనకం. ఉద్యోగస్తులకు పనిభారం. విశ్రాంతి లోపం. వాహనం ఇతరులకివ్వొద్దు. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
ఈ మిశ్రమ ఫలితాలు సమ్మేళనం. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. చేతిలో ధనం నిలవదు. ఉల్లాసంగా గడుపుతారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. పనులు అతికష్టంమీద సానుకూలమవుతాయి. పెద్దల ఆరోగ్యం సంతృప్తికరం. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం కాదు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. దైవదర్శనం, ప్రయాణాలలో ఒకింత అవస్థలు తప్పవు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
వేడకలు ఉల్లాసం కలిగిస్తాయి. చిన్నారులకు కానుకలు అందిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధన మరోదానికి వ్యయం చేస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. స్త్రీలు కళాత్మక పోటీల్లో రాణిస్తారు. ప్రియతములకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. వ్యవహారనుకూలత అంతంతమాత్రమే. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. వాగ్వాదాలకు దిగవద్దు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. అవకాశాలను వదులుకోవద్దు. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు ధనయోగం. అధికారులకు ఒత్తిడి, పనిభారం. పోటీలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
సింహ రాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
అన్ని రంగాల వారికి బాగుంటుంది. వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. మీ మాటకు స్పందన లభిస్తుంది. పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. పొదుపు ధనం గ్రహిస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. భాగస్వామిక వ్యాపారాలు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు. 
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యానాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. గృహంలో మార్పు, చేర్పులకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు, లాభసాటిగా సాగుతాయి. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. దైవదర్శనం సంతృప్తినిస్తుంది. పందాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. 
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
అన్ని రంగాల వారికి శుభదాయకమే. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మాట నిలబెట్టుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఖర్చులు భారమనిపించవవు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. గృహమార్పు కలిసివస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి. అనుభవం గడిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం విజయం ఉల్లాసం కలిగిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వేడుకల్లో పాల్గొంటారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. అనవసర జోక్యం తగదు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. దైవదర్శనాలు ఉల్లాసం సాగిస్తారు. 
 
ధనుర్ రాశి : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
ఈ మాసం ప్రథమార్ధం అనుకూలతలు అధికం. ఆలోచనలు నిలకడగా ఉండవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆర్థిక స్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. దుబారా ఖర్చులు విపరీతం. రుణ ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. సమయానికి సన్నిహితులు ఆదుకుంటారు. కొన్ని సమస్యలు సద్దుమణుగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. పెట్టుబడులకు తరుణం కాదు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం ఉద్యోగస్తులకు ధనప్రాప్తి. వృత్తుల వారికి సామాన్యం. పందాలు, క్రీడా పోటీలు ఉల్లాసాన్నిస్తాయి. వాహనం ఇతరులకివ్వొద్దు. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
సంతోషకరమైన వార్తలు వింటారు. శ్రమ ఫలిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం ధనానికి ఇబ్బంది ఉండదు. వేడుకను ఘనంగా చేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. వ్యవహారానుకూలత ఉంది. పెద్దల సలహా పాటిస్తారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. విదేశీయన యత్నం ఫలిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్రీడాపోటీలు నిరుత్సాహపరుస్తాయి. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
బంధుమిత్రుల రాకపోకరు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచింది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. వ్యాపరాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వైద్య, సాంకేతిక, న్యాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. జూదాలు బెట్టింగ్‌ల జోలికి పోవద్దు. 
 
మీనరాశి : పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి 
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సంతృప్తికరం. సంప్రదింపులు ఫలిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలు ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు విస్తరిస్తాయి. సాధ్యంకాని హామీలివ్వవద్దు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. భాగస్వామిక వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వృత్తి ఉపాధి వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ముఖ్యులకువీడ్కోలు పలుకుతారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. దైవదర్శనం, ప్రయాణంలో అవస్థలు తప్పవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బతికి వున్న పీతలే.. ఆ శివాలయంలో నైవేద్యం.. ఎక్కడ? (Video)