Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాలాష్టమి రోజున కాలభైరవునికి నేతితో దీపమెలిగిస్తే?

కాలాష్టమి శ్రేష్టమైనది. కాలాష్టమి రోజుల కాలభైరవుని పూజించాలి. ఏడాదిలో 12 కాలాష్టమిలు వస్తాయి. ఆదివారం లేదా మంగళవారం వచ్చే కాలాష్టమికి ప్రాధాన్యత ఎక్కువ. సెప్టెంబర్ 2న కాలాష్టమి వస్తోంది. శివభక్తులకు క

కాలాష్టమి రోజున కాలభైరవునికి నేతితో దీపమెలిగిస్తే?
, బుధవారం, 29 ఆగస్టు 2018 (14:57 IST)
కాలాష్టమి శ్రేష్టమైనది. కాలాష్టమి రోజుల కాలభైరవుని పూజించాలి. ఏడాదిలో 12 కాలాష్టమిలు వస్తాయి. ఆదివారం లేదా మంగళవారం వచ్చే కాలాష్టమికి ప్రాధాన్యత ఎక్కువ. సెప్టెంబర్ 2న కాలాష్టమి వస్తోంది. శివభక్తులకు కాలాష్టమి శ్రేష్టమైనది. ఈ రోజున భక్తులు సూర్యోదయానికి ముందుగానే లేచి, స్నానమాచరించి కాలభైరవునికి ప్రత్యేక పూజలు జరపాలి. అష్టమి రోజున వచ్చే ఈ కాలాష్టమి రోజున నేతితో కాలభైరవునికి దీపమెలిగిస్తే సకలసంపదలు చేకూరుతాయి. 
 
తాము చేసిన పాపాలకు శివుని నుండి విముక్తి కోరుతారు. సాయింత్రం వేళలో కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. భక్తులు రోజు పూర్తి ఉపవాసం జరుపుతారు. కొందరు భక్తులు రాత్రి జాగరణ జరుపుతారు. రాత్రి వేళలో కాలభైరవుని కథ చదువుతూ జాగరణ కొనసాగిస్తారు. ఈ వ్రతం ఆచరించినవారికి శాంతి సౌభాగ్యాలు, సంతోషం లభిస్తాయని విశ్వాసం. కాలాష్టమి రోజున పలువురు శునకాలకు ఆహారం సమకూర్చుతారు. వాటిలో నల్లశునకాలు శ్రేష్టమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఆదిత్య పురాణంలో కాలాష్టమి గాథ వుంది. ఈ రోజున చేసే పూజలు శివుని ప్రతిరూపమైన కాలభైరవునికి చెందుతాయి. కాలమును ఆదేశించే శక్తి కాలభైరవునికి అప్పగించబడినట్లు పండితులు చెప్తుంటారు. ఒకప్పుడు బ్రహ్మ శివునితో వాదానికి దిగినప్పుడు శివుడు కోపోద్రిక్తుడై మహాకాలేశ్వరుని రూపం దాల్చి తన త్రిశూలంతో బ్రహ్మ ఐదు తలలలో ఒకటిని తెగవేసినట్లు విశ్వాసం. అప్పటి నుండి దేవతలు మానవులు కాలాష్టమి రోజున శివుని పూజించి కోరికలు తీర్చుకొంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జన్మాష్టమి రోజున ఇలా పూజ చేస్తే.. శ్రీకృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే?