Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్‌.టి.ఆర్‌.ను శ్రీ‌నివాసుడుగా చూపిన పుల్ల‌య్య‌

ఎన్‌.టి.ఆర్‌.ను శ్రీ‌నివాసుడుగా చూపిన పుల్ల‌య్య‌
, సోమవారం, 3 మే 2021 (18:47 IST)
P. pullayya
తెలుగు చ‌ల‌న చిత్ర‌రంగంలో తొలిత‌రం ద‌ర్శ‌కుడు పి. పుల్ల‌య్య‌. ఆయ‌న ఒకే సినిమాను రెండు సార్లు తీశారు. మూడో సారి తీయ‌డానికి ప్ర‌య‌త్నించారు. కానీ కుద‌ర‌లేదు. అదే శ్రీ వెంకటేశ్వర మహత్యం. దర్శకునిగా పి. పుల్లయ్య ప్రతిభ ఏంటో చెప్పడానికి ఈ సినిమా చాలు. ఈ సినిమాను రెండు సార్లు ఆయనే తీశారు. మూడో సారి కూడా తీయాలనుకున్నారు. కానీ కుద‌ర‌లేదు. అప్ప‌ట్లో థియేర్ల‌లో తెర‌లేపే ముందు శ్రీ‌వేంక‌టేశ్వ‌రుని పాట కూడా వ‌చ్చేది. ఆ త‌రం వారికి గుర్తుండే వుంటుంది.
 
ఇక మొట్టమొదట తిరుమల వాసుని కథతో బాలాజీ చిత్రాన్ని తెలుగు వారి ముందు ఉంచింది పుల్లయ్య గారే. అదే కథను 1960లో మరోసారి 'శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం' పేరుతో రూపొందించి మరోమారు తెలుగువారిని పులకింప చేశారు. ముఖ్యంగా రెండో సారి 'శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం' రూపొందించినపుడు థియేటర్లే దేవాలయాలుగా మారాయని ఈనాటికీ చెప్పుకుంటారు. ఆ సమయంలో ఆ చిత్రం ప్రదర్శితమవుతున్న అన్ని కేంద్రాలలోనూ శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాలను నెలకొల్పారు.

ఆ విగ్రహాల వద్ద ఉంచిన హూండిల మొత్తం సొమ్మును సినిమా తీసేంత వ‌చ్చింద‌ని అంటుండేవారు. ఇక ఆయ‌న భార్య న‌టి శాంతకుమారి. పి. పుల‌య్యం జ‌యంతి మే2వ తేదీ. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన సినిమాల‌లో బాగా పేరుండేవి చాలానే వున్నాయి. అర్థాంగి, జయభేరి, సిరిసంపదలు, మురళీకృష్ణ, కొడుకు కోడలు వున్నాయి.

'రేచుక్క, కన్యాశుల్కం' చిత్రాలను ఎన్టీఆర్ తో తెరకెక్కించారు పి. పుల్లయ్య. వీటిలో 'కన్యాశుల్కం' రిపీట్ రన్స్ లోనూ శతదినోత్సవం, రజతోత్సవం జరుపుకోవడం విశేషం. అందుకే 1981లో రాష్ట్రప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది. విశేషం ఏమంటే పుల్లయ్య సతీమణి శ్రీమతి శాంతకుమారికి కూడా 1999లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెస్ట్ కొంచెం చూపించ‌వా.. మా ఆయ‌న వ‌స్తే వేరుగా వుంట‌ది: అన‌సూయ‌