లండన్ బోనాల జాతర... బోనమెత్తిన తెలుగు నటి పూనం కౌర్(ఫోటోలు)
తెలంగాణ ఎన్నారైఫోరం (TeNF) ఆధ్వర్యంలోలండన్లో(హెస్టన్ కమ్యూనిటీ స్కూల్లో) బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి సుమారు 700లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. స్వదేశం
తెలంగాణ ఎన్నారైఫోరం (TeNF) ఆధ్వర్యంలోలండన్లో(హెస్టన్ కమ్యూనిటీ స్కూల్లో) బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి సుమారు 700లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సంప్రదాయబద్దంగా అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపును జరుపుకున్న తీరు ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా స్థానికులని కూడా మంత్రముగ్దులని చేసింది.
ఈ వేడుకలకు తెలంగాణా రాష్ట్రం నుండి రామచంద్రుతే జావత్( రిటైర్డ్ఐఏఎస్) స్థానిక ఎంపీలు వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా, బాలాజీ (Indian High Commission -London) ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. 6వ సంవత్సరం వరుసగా ఎంతో వైభవంగా బోనాల జాతర నిర్వహించారు. తెలంగాణ ఎన్నారై ఫోరం ఈ సంవత్సరము ప్రధానంగా చేపట్టిన 'చేనేతకు చేయూతనిద్దాం నేతన్నకు మద్దతునిద్దాం' అని 'చేనేత వస్త్రాలయం' ద్వారా ప్రవాసులకు, స్థానికులకు చేనేత వస్త్రాలను పరిచయం చేసిన విధానం ప్రశంసనీయం అని ముఖ్య అతిధులు కొనియాడారు.
రామచంద్రుడు తేజావత్ మాట్లాడుతూ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఎన్నారైలు తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ పెట్టుబడుల్లో బాగస్వామ్యులవ్వాలని పిలుపునిచ్చారు. విదేశాల్లో భారతీయ ఐక్యత చాటాలన్నారు. తెలుగు సినిమా నటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ... తెలంగాణ ఎన్నారై ఫోరం చేపట్టిన ''ఎన్నారై విత్ వీవెర్స్, చేనేత చేయూతకు తన సంపూర్ణ మద్దతు ఇస్తానని తెలిపారు. తెలంగాణ ఎన్నారై ఫోరమ్‌తో చేనేతకు చేయూతకు కలిసి పని చేస్తానని తెలిపారు.
తెలంగాణఎన్నారై ఫోరం మహిళావిభాగంతో కలిసి హ్యాండ్లూమ్ వాక్‌లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు బోనాలు పండుగ వేడుకలలో తాను కూడా భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని నటి పూనమ్ కౌర్ పేర్కొన్నారు.
తెలంగాణ ఎన్నారై ఫోరం సంస్థ విద్య, సంగీతం, కళలు, సాంస్కృతిక, క్రీడలు, వ్యాపారం, స్వచ్ఛంద మరియు సమాజ సేవ వంటి పలు రంగాలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు, యువతీయువకులకు 'ఆచార్య శ్రీ జయశంకర్ పురస్కారములు' అందచేశారు. అలాగే ఈ బోనాలు వేడుకలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపికలతో ప్రశంసించారు.
బోనాల పండుగకు యూకే తెలుగు, తెలంగాణ సంఘాలు, యుక్త, తాల్, టీడీఫ్, తెలంగాణ జాగృతి తమ సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేశాయి. తెలంగాణ ఎన్నారై ఫోరం ఐదు సంవత్సరాలలో చేసిన ముఖ్య కార్యక్రమాలను, అతిథులకు వివరించారు. ఖండాంతరాలలో ఉంటూ తెలంగాణా పేదబిడ్దలకు, అనాధలకు, వికలాంగుల బిడ్డలకు చేస్తున్న ఆర్థిక సహాయం వెలకట్టలేనిదని తెలిపారు.
ఆభరణాలు, ఆధునిక వస్త్రశ్రేణి మరియు కళలకు సంబంధించిన ప్రదర్శనను మొదటిసారిగా తెలంగాణ ఎన్నారై ఫోరం సంస్థ నిర్వహించడం ఔత్సాహిక కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది అని, తమ ప్రతిభను ప్రదర్శించి వ్యాపారభివృద్దికి ఎంతో తోడ్పాటును ఇస్తుంది అని ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.
తెలంగాణా ఎన్నారై ఫోరం వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్, ముఖ్య సలహాదారులు అంతటి ప్రమోద్, అధ్యక్షులు సీకా చంద్ర శేఖర్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ గంగసాని, తిరుపతి గోలి, ముఖ్య కార్యదర్శిలు నగేష్ రెడ్డి కాసర్ల, సుధాకర్ గౌడ్ రంగుల, ఉమ్మడి కార్యదర్శిలు భాస్కర్ పిట్ల, సురేష్ గోపతి, కోశాధికారులు వెంకట్ రంగు, నరేష్ మిరియాల, స్కాట్లాండ్ కన్వినర్ శ్రీధర్ రావు కలకుంట్ల, సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి స్వామి ఆశ, క్రీడా కార్యదర్సులు ఎలేందర్ పిట్టల, సుమన్ గోలి , స్పాన్సర్ టీం అశోక్ మేడిశెట్టి, భాస్కర్ మొట్ట, రాజేష్ ఎనపోతుల, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టీం రాజు మాడిశెట్టి, రాజేష్ రెడ్డి పొడపాల, మీడియా టీం - మధుకర్ గుల్యాగారి, సాయి ప్రసాద్ మార్గం, శిరీష కే చౌదరి, స్వచ్చంద మరియు సంక్షేమ టీం - మీనాక్షి అంతటి, సురేష్ వడ్లమూరి, ప్రవీణ్ కుమార్ దండెం, రాధాకృష్ణ వెంకట, తెలంగాణ ఎన్నారై ఫోరం మహిళా విభాగం సభ్యులు - హేమలత గంగసాని, జయశ్రీ గంప, జ్యోతి రెడ్డి కాసర్ల, కవిత గోలి, కావ్య రెడ్డి, మేఘల ఆకుల, ప్రీతీ సీక, ప్రియాంక కర్పూరం, రమాదేవి తిరునగరి, సంధ్య కొకుంట్ల, శౌరి రంగుల, శ్రీలక్ష్మి మర్యాల, శ్రీవాణి మార్గం, సుచరిత కాల్వ, వాణి రంగు, ఏరియా ఇంచార్జిలు సంతోష్ ఏరుకుల్ల, సతీష్ కుమార్, వెస్ట్ & నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ - అజయ్ కుమార్, చిట్టి వంశీధర్ రెడ్డి, రాజ్ బజార్, రమేష్ సింగం గౌడ్, శేషు కుమార్ ఆళ్ళ, సతీష్ వాసిరెడ్డి, సతీష్ గుమ్మడిల్లి, శివ నారపాక, శ్యామ్ కుమార్ పిట్ల, రాజు గౌడ్ కొయ్యడ, నరసింహ రెడ్డి జాన్సర్, ఈస్ట్ & నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్-చంద్ర కాంత్, దుర్గ ప్రసాద్ గూడెపు, దేవులపల్లి శ్రీనివాస రావు, రవి గౌడ్ దిండు, సంతోష్ కోడిప్యాక, శ్రీనివాస్ రుద్రా, శశి కొప్పుల, శ్రీధర్ బాబు మంగళారపు, ప్రత్యేక ఆహ్వానితులు లక్ష్మ రెడ్డి తుకారాం, వెంకట్ రెడ్డి వెన్కమొళ్ళ, వేణు గోపాల్ రెడ్డి అందేం, వెంకట్ రెడ్డి పబ్బాతి, శ్రీధర్ బ్యరీక, సత్య రెడ్డి దండా బోనాలు వేడుకలలో కీలకంగా పాల్గొని విజయవంతం చేశారు.