తిన్నది జీర్ణం కాక సతమతం... వాంతి చేసుకోవాల్సిందే... కానీ ఎలా?
పసుపు పరమౌషధంగా వుపయోగపడుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను ఇది ఎదుర్కొంటుంది. కొన్నిటిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. * పసుపు పొడి, అతి మధురం చూర్ణం సమంగా తీసుకుని, ఈ మిశ్రమానికి కొంచెం తేనె కలిపి మూడు గ్రాముల మోతాదుతో రోజుకు రెండు పూటలా తింటూ వుంటే దీర్ఘక
పసుపు పరమౌషధంగా వుపయోగపడుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను ఇది ఎదుర్కొంటుంది. కొన్నిటిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం.
* పసుపు పొడి, అతి మధురం చూర్ణం సమంగా తీసుకుని, ఈ మిశ్రమానికి కొంచెం తేనె కలిపి మూడు గ్రాముల మోతాదుతో రోజుకు రెండు పూటలా తింటూ వుంటే దీర్ఘకాలంగా వేధిస్తున్న దగ్గు సమస్య తగ్గుతుంది.
* పసుపు, ధనియాలు, సుగంధిపాలు ఈ మూడు సమానంగా కలిపి కొంచెం నీళ్లు పోసి నూరి రాత్రిపూట ముఖానికి లేపనంగా వేసుకోవాలి. ఆ తర్వాత ఉదయమే గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే మొటిమలు, మచ్చలు మాయమవుతాయి.
* కొన్ని రకాల ఆహార పదార్థాలు లేదా మత్తు పదార్థాలు అతిగా తీసుకున్నప్పుడు అవి జీర్ణం కాక చాలా ఇబ్బందిపెడుతుంటాయి. ఆ పరిస్థితిలో వాతి చేసుకోవడం అవసరమవుతుంది. పసుపు చూర్ణం, గ్లాసుడు వేడి నీళ్లలో మూడు గ్రాముల పరిమాణంలో వేసి తాగితే కొద్దిసేపట్లోనే అజీర్ణకర పదార్థాలన్నీ వాంతి ద్వారా బయటకు వచ్చేసి ఉపశమనం కలుగుతుంది.