Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లోకేష్ అమెరికా పర్యటనను విజయవంతం చేస్తాం... ఎన్నారై తెదేపా

Advertiesment
nara lokesh tour to america
, శనివారం, 2 మే 2015 (22:08 IST)
నారా లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా బే ఏరియాలో ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ మే 3 నుంచి 10 వరకూ జరుప తలపెట్టిన అమెరికా పర్యటనపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారైలు మాట్లాడుతూ... గ్రామాల దత్తతకి అధిక సంఖ్యలో ముందుకు వచ్చి గ్రామాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు మరియు పెట్టుబడులకు మంచి అవకాశం ఉందనీ, ఈ అవకాశాన్ని ఎన్నారైలు అందిపుచ్చుని ఏపీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో ఉన్న తెలుగువారు లోకేష్ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు కొమ్మినేని, అశోక్ దాచర్ల, గోపీ పోలవరపు, రవి వలివేటి, శివప్రసాద్ రెడ్డి, కోటి బొల్లినేని, ప్రమోద్, నవీన్ కొడాలి, పుల్లారావు మందడపు, బాలాజీ దొప్పలపూడి, శ్రీధర్ నెల్లూరు, వెంకట్ కొడాలి, నరేష్ మానుకొండ, శ్రీనివాసరావు చెరుకూరి, రాంబాబు మందడపు, ప్రశాంత్ కర్రి తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu