Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లండన్‌లో ఘనంగా జయశంకర్‌కి నివాళి

కెసిఆర్ తెరాస సపోర్టర్స్ ఆఫ్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ సిద్దాంతకర్త స్వర్గీయ ప్రొ.జయశంకర్ జయంతి వేడుకులని లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యుకె నలుమూలల నుండి తెరాస శ్రేణులు, తెలంగాణ వాదులు, పాల్గొన్నారు.

Advertiesment
లండన్‌లో ఘనంగా జయశంకర్‌కి నివాళి
, సోమవారం, 7 ఆగస్టు 2017 (18:15 IST)
కెసిఆర్ తెరాస సపోర్టర్స్ ఆఫ్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ సిద్దాంతకర్త స్వర్గీయ ప్రొ.జయశంకర్ జయంతి వేడుకులని లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యుకె నలుమూలల నుండి తెరాస శ్రేణులు, తెలంగాణ వాదులు, పాల్గొన్నారు.
 
సురేష్ గోపతి ముందుగా జయశంకర్ చిత్ర పటాన్ని పూలతో నివాళులర్పించి, జయశంకర్‌ను స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. తరువాత సంస్థ ప్రతినిథులు సురేష్ గోపతి మాట్లాడుతూ, తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ పాత్ర గొప్పదని, తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆజన్మ బ్రహ్మచారి కొత్తపల్లి జయశంకర్‌ అని కొనియాడారు.
 
నాన్‌ ముల్కీ ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ సాధన పోరాటం వరకు ఆయన పాత్ర చిరస్మరణీయం. వారు చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పనిచేసారని, అటువంటిది తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అయిన సంతోష సందర్భంలో మన మధ్య లేకపోవడం చాల బాధాకరం అని పేర్కొన్నారు.
 
గోలి తిరుపతి మాట్లాడుతు అనుకున్న ఆశయ సాధనకై వారు చేసి కృషి ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని, వారి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని, రాబోయే తరాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది అని కొనియాడారు. రంగు వెంకట్ మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ సంఘాలు అన్ని ఆచార్య మానస పుత్రికలని, వారి ఆశయాలకు అనుగుణంగా మనం తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.
 
సంస్థ ఫౌండర్ ఛైర్మెన్ సిక్కా చంద్ర శేఖర్ మాట్లాడుతూ  ప్రొ. జయశంకర్ జయంతి వేడుకుల సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ఫిల్టర్‌ని అందజేయడం జరిగినది. రాబోయే రోజుల్లో సంస్థ చేయబోయే వివిధ సేవ కార్యక్రమాల గురించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ యూకే జాగృతి అధ్యక్షులు సుమన్ బలమూరి, మరియు సభ్యులు లండన్ గణేష్, jtrdc అధ్యక్షులు సృజన రెడ్డి చాడ మరియు సభ్యులు మధు అందేం, యూకేలో స్థిరపడి ఇక్కడ ప్రముఖ bbc సంస్థలో పనిచేసే కరీంనగర్ జిల్లా వాసి భారతి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. కెసిఆర్ తెరాస సపోర్టర్స్ ఆఫ్ యూకే సంస్థ సభ్యులు గోలి తిరుపతి, భాస్కర్ మొట్ట, ప్రశాంత్, శ్రీధర్, రఘు నక్కల, నరేష్ మర్యాల, వెంకట్ రంగు, వేణురెడ్డి పాల్గొన్నారని ఈ సందర్భంగా తెలియచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొన్నగంటి, గోరింటాకు పొడి కలిపి జుట్టుకు పట్టిస్తే?