పొన్నగంటి, గోరింటాకు పొడి కలిపి జుట్టుకు పట్టిస్తే?
పొన్నగంటి కూర ఒక కప్పు, ఒక కప్పు గోరింటాకు పొడి కలిపి అందులో రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్టులా చేసుకుని.. ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 20 నిమిషాల
పొన్నగంటి కూర ఒక కప్పు, ఒక కప్పు గోరింటాకు పొడి కలిపి అందులో రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్టులా చేసుకుని.. ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే రోజుకో ఆకుకూర తీసుకోవాలి. అవి శరీరాన్నే కాదు జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టురాలడం, చుండ్రు వంటి సమస్యలను దూరం చేస్తాయి.
ఇంకా కొద్దిగా మజ్జిగలో చింత చిగురు, కప్పు గోరింటాకు పొడి, అరకప్పు శనగపిండి కలిపి, తలకు బాగా నూనె రాసుకుని ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. గోరింటాకు పొడి, రెండు స్పూన్‌ల ముల్తాన్ మట్టి, కప్పు పెరుగు కలిపి పేస్టు తయారు చేసుకోవాలి. దానిని తలకు బాగా పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది.