Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోపిశెట్టి శ్రీధర్‌కు అంతర్జాతీయ గుర్తింపు

Sridhar
, మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (21:16 IST)
తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి వర్ధమాన రచయిత, తెలుగు సినిమా అసోసియేట్ డైరెక్టర్ గోపిశెట్టి శ్రీధర్ ఎంపికయ్యారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక "ఆజాదీకా అమృత మహోత్సవ్" ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్ఠాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది.  

 
ఈ పోటీలో కోనసీమ జిల్లా, ఐ. పోలవరం మండలం, పశువుల్లంకకు చెందిన వర్ధమాన రచయిత, తెలుగు సినిమా అసోసియేట్ డైరెక్టర్ శ్రీ గోపిశెట్టి శ్రీధర్ ఎంపికయ్యారు. ఏప్రిల్ 22 తేదీన జూమ్‌లో తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి కవితా వేదిక మీద శ్రీధర్ తమ కవితను వినిపించబోతున్నారు. భారతదేశ సమగ్రతను వర్ణిస్తూ, భావయుక్తంగా వారు రాసిన "పండించే పల్లె - ప్రకాశించే పట్టణం" అనే కవిత ఈ పోటీలో ఎంపికయింది.
 
ఇంతటి విశేషమైన కార్యక్రమంలో ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పరిచయం చేస్తున్నందుకు 
తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి శ్రీధర్ ధన్యవాదాలు తెలియజేశారు.
అనేకమంది దేశ, విదేశ తెలుగు కవులు, ప్రముఖులు హాజరయ్యే ఈ "తానా కవితాలహరి" కార్యక్రమం తానా అధికారిక యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
 
"యప్ టీవీ" ద్వారా అమెరికాతో పాటు, యూరప్ దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈటీవీ భారత్, మన టీవీ, టీవీ ఆసియా తెలుగు మరియు ఇతర మాద్యమాలలో ప్రసారం కానుంది. సరళమైన భాషలో, సామాజిక స్పృహ కోసం రచనలు చేసే శ్రీధర్ తెలుగు సినిమా రంగంలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈరోజు పశువుల్లంక గ్రామం ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన శ్రీధర్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పెద్దలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కోనసీమ జిల్లా నాయకులు, ప్రముఖులు, సాహితీవేత్తలు ప్రశంసలతో శ్రీధర్‌ను ముంచెత్తుతున్నారు.
 
 
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్, తెలుగు దర్శకుల సంఘం ప్రెసిడెంట్ కాశీ విశ్వనాధ్, మంత్రులు పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు మరియు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు గోపిశెట్టి శ్రీధర్‌ను అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజూ కొన్ని తాజా గులాబీ రేకలను తింటే...?