లాక్‌డౌన్ సమయంలో నాట్స్ దాతృత్వం, అనాథాశ్రమానికి నిత్యావసరాలు పంపిణీ

బుధవారం, 8 ఏప్రియల్ 2020 (22:33 IST)
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, ఇటు తెలుగునాట కూడా సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తోంది. కరోనా దెబ్బకు లాక్‌డౌన్‌తో ఆగమ్యగోచరంగా మారిన పేదలు, అనాథలకు తనవంతు సాయం చేయాలని నిశ్చయించుకుంది. 
 
గుంటూరు జిల్లా నిడుబ్రోలులోని గోతాలస్వామి అనాధ ఆశ్రమానికి కావాల్సిన నిత్యావసరాలను ఉచితంగా నాట్స్ పంపిణి చేసింది. నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి సౌజన్యంతో పొన్నూరు సీఐ ప్రేమయ్య చేతుల మీదుగా ఈ అనాధ ఆశ్రమానికి దాదాపుగా ఓ నెల రోజులకు సరిపడా బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, అరటిపండ్లు, కూరగాయలు అందించారు. 
 
నాట్స్ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి సన్నిహితులు కామేపల్లి వెంకటేశ్వరరావు, దొంతినేని సాయికృష్ణ, బొద్దూలూరి కిశోర్ బాబు, అడ్వకేట్ బాజీ తదితరులు అనాధ ఆశ్రమానికి వెళ్లి... అక్కడ ఉండే 200 మందికి ఈ కష్టకాలంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఈ 8 ప్రయోజనాలు తెలిస్తే నల్లద్రాక్షను తినకుండా వుండరు...