Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లండన్ జింఖానా గ్రౌండ్లో 70వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

హై కమిషన్ ఆఫ్ ఇండియా, యూకె ఆధ్వర్యంలో లండన్ జింఖానా గ్రౌండ్లో 70వ భారత స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొదట భారత హై కమిషనర్ శ్రీ నవతేజ్ సర్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు.

Advertiesment
70th Independance day celebration in london
, మంగళవారం, 23 ఆగస్టు 2016 (12:56 IST)
హై కమిషన్ ఆఫ్ ఇండియా, యూకె ఆధ్వర్యంలో లండన్ జింఖానా గ్రౌండ్లో 70వ భారత స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొదట భారత హై కమిషనర్ శ్రీ నవతేజ్ సర్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. వివిధ రాష్ట్రాల నుండి ఇంగ్లాండ్‌లో స్థిరపడ్డ చిన్నారుల చేత జాతీయగీతం పాడారు. అనంతరం శ్రీ సర్ణ గారు ప్రసంగించి, అతిధులను సత్కరించారు. కార్యక్రమంలో 8000 నుండి 10000 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో ఒక్కో రాష్ట్రం నుండి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 
 
తెలంగాణా రాష్ట్ర ప్రాముఖ్యత, విశిష్టత గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులకు మరియు ఇతర ఆతిథులకు తెలియజేయాలనే భావనతో, తెలంగాణా ఎన్నారై ఫోరమ్ (TeNF) ఆధ్వర్యంలో తెలంగాణా ప్రముఖులు, తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు, సంవత్సర కాలంలోని విజయాలతో కూడిన ప్రత్యేక "తెలంగాణా స్టాల్"ని ఏర్పాటు చేయడం జరిగింది.
 
తెలంగాణ రాష్ట్రము తరపున తెలంగాణా ఎన్నారై ఫోరమ్ (TeNF) పాల్గొని బోనాలు జాతర జానపద గేయ నృత్య ప్రదర్శన చేసారు. సిక్క ప్రీతీ గౌడ్, శ్వేతల ఆధ్వర్యంలో కంది సుమ, అపర్ణ, జ్యోతి, పవిత్ర, లక్ష్మి లత, మీనాక్షి, సంధ్య, వాణి, జయశ్రీలు పాల్గొన్నారు.
1)హై కమిషన్ ఆఫ్ ఇండియా, యూకె వారు తెలంగాణ ఎన్నారై ఫోరంకు తెలంగాణ రాష్ట్రం తరపున స్టాల్ కేటాయించారు. 
2) తెలంగాణ ప్రభుత్వం టూరిజం వారి పుస్తక ప్రదర్శన, తెలంగాణ రాష్ట్ర టూరిజంపై వివరణాత్మక ప్రదర్శన
3) తెలంగాణ చరిత్ర, సాహిత్యం, మహనీయుల చిత్రపట ప్రదర్శన
4) తెలంగాణ సాహిత్య పుస్తక ప్రదర్శన నిర్వహించారు. 
 
తెలంగాణ స్టాల్‌ను సందర్శించిన ప్రముఖుల్లో భారత హై కమిషనర్ శ్రీ సర్న గారు. కేంద్రమంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ గారు, భారత సంతతికి చెందిన MP శ్రీ వీరేంద్ర శర్మ, MP శ్రీ సీమ గార్లు, డిప్యూటీ హై కమిషనర్ గార్లు ఉన్నారు. "తెలంగాణా స్టాల్"ని  సందర్శించి, తెలంగాణా సంస్కృతి - సాంప్రదాయాలు, పర్యాటక ప్రత్యేకత, ప్రతిమ మరియు ప్రముఖుల పరిచయంతో కూడిన సమగ్ర సమాచారం - ప్రదర్శన చాలా గొప్పగా ఉందని, నూతన రాష్ట్ర సంస్కృతిని, గొప్పతనాన్ని, పెట్టుబడులకు అనుకూల పరిస్థితుల గురించి ప్రపంచానికి చూపెట్టాలని ప్రయత్నం చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రసంశించారు. అలాగే గత సంవత్సరంగా తెలంగాణా రాష్ట్రం ముందుకు వెళ్తున్న తీరు గమనిస్తున్నామని, ఇంకా ఎన్నో ఆసక్తి కల విషయాలను తెలంగాణా ఎన్నారై ఫోరమ్ ప్రతినిథులని అడిగి తెలుసుకున్నారు.  
 
స్టాల్లో ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల, తెలంగాణా ప్రముఖుల చిత్ర పటాలకు నివాళులర్పించి, స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి ఏర్పాటు చేసిన కేక్‌ను భారత హై కమీషనర్ గారు కట్ చేయడం జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్లూ ఫిల్మ్స్ వీక్షిస్తే... పెళ్లి పెటాకులే!