Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20వ తానా మహాసభల ఘన విజయం....

Advertiesment
20th TANA Conference success
, శనివారం, 11 జులై 2015 (22:38 IST)
జూలైలో 2-4న డిట్రాయిట్లో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన 20వ తానా మహాసభలకు తానా పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్స్ మరియు ప్రింటింగ్ మీడియా కమిటీ తమవంతు బాధ్యతను నిర్వహించింది. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ మహాసభలకు పలు రంగాలకు చెందిన అమెరికా, భారత్, కెనడా నుంచి సాహితీవేత్తలు, రచయితలు, నవలా రచయితలు, వేద పండితులు, శతావధాన దిగ్గజాలు, ప్రముఖ తెలుగు పండితులు, తెలుగు కవులు, ప్రముఖ పాత్రికేయులు, కళాకారులు, ప్రదర్శనకారులు ఎందరో పాల్గొన్నారు. 
 
ఈ మహాసభలకు సంబంధించిన అన్ని వివరాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి చేరవేసేందుకు పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్స్ మరియు ప్రింట్ మీడియా కమిటీ అలుపెరగని రీతిలో కృషి చేసింది. 20వ తానా మహాసభల పబ్లిసిటీ, పీఆర్వో మరియు ప్రింట్ మీడియా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ సజ్జా, కో-చైర్స్‌గా కృష్ణప్రసాద్ ఆలపాటి, జగదీష్ బొడ్డపాటి, రమణ ముదిగంటి మరియు కమిటీ అడ్వయిజరీ పిచ్చయ్య చౌదరి వ్యవహరించారు. 
 
అలాగే పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్స్ మరియు ప్రింట్ మీడియా కమిటీ సభ్యులు త్రివేణి చావా, శైలజా కుమార్ నన్నూరు, శ్రీనివాస్ లోకుల, వెంకటేష్ బాబు, సురేష్ బాబు, సత్య, సురేష్, రవిశంకర్, మనోజ్, హితేంద్ర ఎప్పటికప్పుడు వివిధ కమిటీల నుండి గ్రహించిన సమాచారాన్ని అన్ని ప్రింట్ మీడియాలకు అందచేయడానికి అహర్నిశలు కృషి చేశారు. 20వ తానా మహాసభల కార్యక్రమాల వివరాలను అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్న తెలుగువారందరితోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ అందించి ఈ మహాసభలను జయప్రదం చేసేందుకు దోహదపడింది. 
 
తానా మహాసభలకు సంబంధించిన సుమారు 50 కమిటీలతో సంప్రదించి వారి కమిటీల కార్యక్రమం వివరాలను అప్పటికప్పుడు సభ్యులకు అందజేశారు. మహాసభల కార్యక్రమాల సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇ-మెయిల్స్ ద్వారా, వెబ్ సైట్స్ ద్వారా, పత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా సభ్యులకు తెలియజేశారు. ముఖ్యంగా అన్ని కమిటీలతో ముఖాముఖి నిర్వహించి వారివారి కమిటీల కార్యక్రమాలను, విధివిధానాలను ఇంటర్వ్యూల రూపంలో ప్రచురించారు. ఈ పద్ధతిలో ఆయా కమిటీలు చేస్తున్న ఏర్పాట్లు, కార్యక్రమాలతోపాటు కమిటీ సభ్యులు చేస్తున్న కృషిని వివరించారు. 
 
పబ్లిసిటీలో భాగంగా సమాచారాన్ని అందమైన ప్లయ్యర్ల రూపంలో ప్రచురించి డిట్రాయిట్ లోనే కాకుండా వివిధ ప్రాంతాలలో కూడా అందజేశారు. వివిధ పత్రికా సంపాదకులను, వెబ్‌సైట్లు మరియు రేడియో కార్యక్రమాల నిర్వాహకులను సమన్వయపరచుకుని సంప్రదించి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. 20వ తానా మహాసభల కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని వివిధ నగరాలలో నిర్వహిస్తున్న ధీంతానా మరియు ఆటల పోటీల వివరాలను ప్రాంతీయ తెలుగు సంస్థల ద్వారా అందించి, అమెరికాలోని తెలుగువారందరూ ఈ తానా మహాసభలలో పాల్గొనేవిధంగా సమాచారాన్ని అందజేశారు. డిట్రాయిట్లో జూలై 2 నుంచి 4 వరకూ జరిగిన తానా మహాసభలకు సుమారు 12 వేల మంది తెలుగువారు వచ్చే రీతిలో ఈ కమిటీ పనిచేసింది. 
 
ఈ తానా మహాసభలలో అన్ని కార్యక్రమాలను అద్భుతంగా కెమేరాలో బంధించిన ఫోటోగ్రఫీ అధ్యక్షులు శ్రీ కోటి కన్నెగంటి, ఉపాధ్యక్షులు శ్రీ సునీల్ కోనేరు మరియు శ్రీనివాస రెడ్డి తానా అధ్యక్షులు ప్రత్యేకంగా అభినందించారు. వారి టీంలో శ్రీయుతులు ముక్తేశ్ నందిగామ, శ్రీనివాస్, విజయ్ కుమార్, ఆనంద్, చంద్రకాంత్, గణేష్, రాజు, పురుషోత్తం, సూర్యప్రకాష్, సాంబశివరావు తదితరులు సహాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu