కావలసిన పదార్థాలు :
చికెన్... ఒక కేజీ
ఉల్లిపాయలు... నాలుగు
అల్లం వెల్లుల్లి ముద్ద... రెండు టీ.
పసుపు... పావు టీ.
మిరియాలపొడి... రెండు టీ.
వెనిగర్... రెండు టీ.
ఉప్పు... సరిపడా
నూనె... వేయించేందుకు తగినంత
తయారీ విధానం :
చికెన్ ముక్కలకు ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి, పసుపు, వెనిగర్ పట్టించి.. కనీసం రెండు లేదా మూడు గంటలసేపు నానబెట్టాలి. మందపాటి పాన్‌లో తగినంత నూనె వేసి కాగిన తరువాత, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. తరువాత ఉల్లిముద్ద కూడా వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించాలి.
ఆ తరువాత నానబెట్టిన చికెన్‌ను వేసి, తగినన్ని నీళ్లు పోసి మీడియం మంటమీద... కూర చిక్కబడి, నూనె పైకి తేలేదాకా ఉడికించి దించేయాలి. అంతే స్పైసీ పెప్పర్ చికెన్ రెడీ అయినట్లే...!!