Publish Date: Thu, 29 Jan 2009 (18:05 IST)
Updated Date: Thu, 29 Jan 2009 (18:04 IST)
కావలసిన పదార్ధాలు :
సొరచేప... అరకిలో
కొత్తిమీర... ఒకకట్ట
కారం...రెండు టీస్పూన్లు
నూనె.. వంద గ్రాములు
దాల్చిన చెక్క, లవంగాలు.. చెరి నాలుగు
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిరపకాయలు... ఆరు
వెల్లుల్లి... రెండు రెబ్బలు
ఉప్పు... తగినంత
ధనియాలు... రెండు టీస్పూన్లు
తయారీ విధానం :
చేపలను బాగా శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో వేసి.. తగినన్ని నీళ్లుపోసి ఒక పొంగు వచ్చేదాకా ఉడికించాలి. చేపలు చల్లారిన వాటిపై ఉన్న తోలు వలిచి, తడి లేకుండా బాగా పిండేయాలి. ఆ తరువాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు బాగా మెత్తగా నూరి ఉంచుకోవాలి. ధనియాలు, దాసిన చెక్క, లవంగాలు పొడిచేయాలి. అలాగే ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉంచాలి.
ఇప్పడు.. ఉడికించి నీళ్లు పిండిన సొరచేపను పొడి పొడిగా చేసి అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి కలపాలి. ఒక బాణాలిలో నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయలు, నూరి ఉంచిన మసాలా పొడి వేసి వేయించాలి. కాసేపు వేగిన తరువాత సొరచేప మిశ్రమాన్ని కూడా జతచేసి సరిపడా ఉప్పు వేయాలి. బాగా వేగిన తరువాత కొత్తిమీర తరుగు పైన చల్లి దించేయాలి. అంతే సొరచేప పొరుటు సిద్ధమైనట్లే...!