కావలసిన పదార్థాలు :
చేపలు... ఒక కేజీ
అల్లంవెల్లుల్లి పేస్ట్.. 2 టీ.
ఉల్లిపాయలు... రెండు
టొమోటో గుజ్జు... ఒక కప్పు
పెరుగు... అర కప్పు
బాదంపప్పు... ఎనిమిది
జీడిపప్పు... ఎనిమిది
గరంమసాలా... ఒక టీ.
పసుపు... చిటికెడు
పుదీనా ఆకులు... ఒక కట్ట
ఆవనూనె... పావు కేజీ
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
చేపలను శుభ్రం చేసి, ముక్కలుగా కోసుకుని వాటికి ఉప్పు కలపాలి. బాణలిలో ఎక్కువగా నూనె పోసి, చేప ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి, పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే నూనెలో ఉల్లిముక్కలను వేయించి, ఆపై అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసి వేయించాలి.
పుదీనా, కొత్తిమీరను కలిపి మిక్సీలో వేసి మెత్తగా అయ్యాక, ఈ పేస్ట్‌ను పై మిశ్రమంలో కలిపి మరో మూడు నిమిషాలు వేయించాలి. అందులోనే పసుపు, కారం, ఉప్పు వేసి కలియబెట్టి, పెరుగును కూడా వేసి మరో రెండు నిమిషాలు మగ్గాక.. చేప ముక్కలను కలపాలి. మూతపెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించి దించేసి, కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి.