Publish Date: Fri, 23 Jan 2009 (20:12 IST)
Updated Date: Fri, 23 Jan 2009 (20:11 IST)
కావలసిన పదార్థాలు :
రొయ్యలు... ఒక కేజీ
గసగసాలు... ఆరు టీస్పూన్లు
ధనియాలు... రెండు టీస్పూన్లు
ఉల్లిపాయలు... నాలుగు
అల్లం... ఒక ముక్క
ఉప్పు... సరిపడా
పచ్చిమిర్చి... పన్నెండు
నూనె... 400 గ్రాములు
దాల్చిన చెక్క... పది
లవంగాలు... పది
కొత్తిమీర... ఒక కట్ట
పసుపు... తగినంత
తయారీ విధానం :
రొయ్యలను శుభ్రంగా వలిచి, కడిగి ఒక పాత్రలో ఉంచుకోవాలి. తరువాత వాటిలో ఉప్పువేసి, నీరు ఇగిరిపోయేదాకా బాగా ఉడికించాలి. ఉడికించిన రొయ్యలను బాగా నూరి, అందులో ముందుగానే నూరి ఉంచుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయల ముద్దను కూడా కలపాలి.
తరువాత గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, పసుపులను మెత్తగా పొడి చేసి... రొయ్యల మిశ్రమానికి పట్టించాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి బాగా కాగిన తరువాత... పైన నూరి ఉంచుకున్న రొయ్యల మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని... వడల్లాగా వత్తి కాగుతున్న నూనెలో వేయాలి.
బంగారు వర్ణం వచ్చేదాకా వాటిని వేయించి న్యూస్ పేపర్ పరిచిన ఓ పాత్రలోకి తీసుకోవాలి. అలా మొత్తం మిశ్రమాన్నంతా వడల్లాగా చేసిన తరువాత సర్వింగ్ డిష్‌లో వాటిని సర్ది... పైన కొత్తిమీర తరుగు చల్లి అతిథులకు వడ్డించాలి. వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటాయి. ఏదేని గ్రీన్ చట్నీ లేదా టమోటో సాస్, పచ్చిమిర్చి సాస్‌లతో కలిపి తింటే బాగుంటాయి.