Article Non Vegetarian %e0%b0%b0%e0%b1%8a%e0%b0%af%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8b %e0%b0%ae%e0%b1%81%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%95%e0%b1%82%e0%b0%b0 108072200061_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రొయ్యలతో ముద్దకూర

Advertiesment
రొయ్య ముద్దకూర బాణలి నూనె మసాలాలు వేడి రొయ్యలు కొబ్బరి ఉప్పు ధనియాలు పచ్చిమిర్చి యాలకులు గసగసాలు లవంగాలు
FileFILE
కావలసిన పదార్థాలు :
నూనె... నూరుగ్రాములు
రొయ్యలు... అరకిలో
కొబ్బరి ముక్క... చిన్నది
ఉప్పు... తగినంత
ఉల్లిపాయలు... రెండు
ధనియాలు... రెండు స్పూన్లు
పచ్చిమిర్చి... నాలుగు
యాలకులు, గసగసాలు, లవంగాలు... మూడేసి
పసుపు... కొంచెం
వెల్లుల్లి... నాలుగు రెబ్బలు
కొత్తిమీర... పది రెబ్బలు

తయారీ విధానం :
ఒక బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయలను వేసి వేయించాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించిన తరువాత అందులో పసుపువేసి కలిపి ఆపై శుభ్రం చేసుకున్న రొయ్యలను వేసి వేయించాలి. ఇవి వేగుతుండగా... మరోవైపు కొబ్బరిముక్క, ధనియాలు, యాలకులు, గసగసాలు, లవంగాలు, వెల్లుల్లిలను మెత్తగా నూరుకోవాలి.

వేగుతున్న రొయ్యలలో మెత్తగా నూరుకున్న మసాలాలను కలపాలి. దీనికి తగినంత కారం, ఉప్పు కలుపుకుని గ్రేవీ దగ్గరకు వచ్చేదాకా ఉడికించాలి. నూనె కూర పైకి తేలుతున్నప్పుడు కొత్తిమీర చల్లి దించేసి, వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu