కావలసిన పదార్థాలు :
పచ్చి రొయ్యలు... అర కేజీ
ఉల్లిపాయలు... నాలుగు
పచ్చిమిర్చి... పది
అల్లం... పెద్ద ముక్క
కారం... రెండు టీ.
బంగాళాదుంపలు... 700 గ్రా.
కొత్తిమీర... మూడు కట్టలు
రస్కులపొడి... 200 గ్రా.
నూనె... వేయించేందుకు సరిపడా
కోడిగుడ్లు... రెండు
తయారీ విధానం :
రొయ్యల్ని పొట్టు తీసి ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోయాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి కొద్దిగా నూనె పోసి కాగాక రొయ్య ముక్కల్నీ ఉల్లి, పచ్చిమిర్చి ముక్కల్నీ వేసి వేయించాలి. ఉప్పూకారం చల్లి పక్కకు ఉంచాలి. బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి.
అందులోనే వేయించిన రొయ్య ముక్కల్ని, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఈ ముద్దను చిన్న సైజు కట్‌లెట్స్‌లా చేసి గిలకొట్టిన గుడ్డుసొనలో ముంచి తీసి, రస్కుల పొడి అద్దాలి. ఇప్పుడు బాణలిలో సరిపడా నూనె పోసి కాగాక ఈ కట్‌లెట్స్‌ను డీప్ ఫ్రై చేసి తీయాలి. వీటిని టొమాటోసాస్‌తో కలిపి తింటే బాగుంటాయి.