Publish Date: Fri, 09 Jan 2009 (11:12 IST)
Updated Date: Fri, 09 Jan 2009 (11:11 IST)
కావలసిన పదార్థాలు :
పెద్ద రొయ్యలు... పావుకేజీ
వెనిగర్... ఒక టీస్పూన్
కోడిగుడ్లు... రెండు
అల్లం, ఉల్లి రసం... రెండు టీస్పూన్లు
బ్రెడ్ ముక్కల పొడి... ఒక కప్పు
ఉప్పు... సరిపడా
నూనె... తగినంత
తయారీ విధానం :
రొయ్యలను శుభ్రం చేసుకుని వెనిగర్, ఉప్పు, ఉల్లి, అల్లం రసంతో కలుపుకోవాలి. అలాగే కాసేపు ఉంచిన తరువాత చెక్క గరిటెతో రొయ్యలను సాపు చేసి, బీట్ చేసి పెట్టుకున్న గుడ్ల మిశ్రమంలో ముంచి, బ్రెడ్ ముక్కల పొడిలో అద్దాలి.
అలా మొత్తం రొయ్యలను ఒక్కోదాన్ని పై విధంగా చేసి కాగుతున్న నూనెలో వేసి, బాగా డీప్ ఫ్రై చేసి తీసేయాలి. సర్వింగ్ డిష్‌లో వీటిని అలంకరించి... కొత్తిమీర చట్నీతోగానీ, సాస్‌తోగానీ సర్వ్ చేయాలి.