Publish Date: Fri, 18 Jul 2008 (18:15 IST)
Updated Date: Fri, 18 Jul 2008 (18:14 IST)
కావలసిన పదార్థాలు :
ఎముకలు లేని మాంసం... అరకేజీ
ఆలివ్ నూనె... 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు... తరిగినవి 150 గ్రాములు
వెల్లుల్లి పేస్ట్... ఒక టీస్పూన్
మైదాపిండి... రెండు టీస్పూన్లు
కారం... ఒక టీస్పూన్
టమోటోలు... తరిగినవి 2 కప్పులు
క్యాప్సికమ్... పెద్దది ఒకటి
పెరుగుమీది పుల్లటి మీగడ... అరకప్పు
ఉప్పు... రెండు టీస్పూన్లు
నల్లమిరియాలపొడి... అర టీస్పూన్
తయారీ విధానం :
ఓ పాత్రలో నూనె వేడిచేసి అందులో మాంసం ముక్కలను వేసి అన్నివైపులా ఎర్రటిరంగు వచ్చేదాకా వేయించాలి. వేగిన తరువాత ముక్కలను తీసి పక్కనబెట్టి అదే పాత్రలో తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేసి, అవి వేగిన తరువాత పక్కనుంచిన మాంసం ముక్కల్ని కూడా వేయించాలి.
కారం, మైదాపిండిలను పై కూరకు పట్టించి సన్నటి మంటపై నూనె తేలేదాకా ఉడికించాలి. ఆపై తరిగిన టమోటో ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి మాంసం ముక్కలు మెత్తబడేదాకా ఉంచాలి. చివర్లో తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి మరి కాసింతసేపు ఉడికించాలి. ఇలా తయారైన వేడి వేడి మటన్ కర్రీపై పుల్లటి పెరుగు మీది మీగడను అలంకరించి అతిథులకు సర్వ్ చేయండి.