Publish Date: Fri, 23 Jan 2009 (20:16 IST)
Updated Date: Fri, 23 Jan 2009 (20:16 IST)
కావలసిన పదార్థాలు :
మటన్... అరకేజీ
పచ్చిమామిడికాయలు... రెండు
గసగసాలు... ఒక టీస్పూన్
జీలకర్ర... రెండు టీస్పూన్లు
ధనియాలు... ఒక టీస్పూన్
గరంమసాలా... ఒక టీస్పూన్
కారం... మూడు టీస్పూన్లు
పసుపు... చిటికెడు
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిర్చి... నాలుగు
అల్లం, వెల్లుల్లి పేస్ట్... రెండు టీస్పూన్లు
నూనె, ఉప్పు... తగినంత
తయారీ విధానం :
మటన్ ముక్కలకు ఉప్పు, కారం పట్టించి పక్కన ఉంచుకోవాలి. గసగసాలు, ధనియాలు, జీలకర్ర, గరంమసాలాలను వేయించి పొడి కొట్టుకుని, కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లాగా చేసుకోవాలి.
ఒక పాన్‌లో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయముక్కలు, పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి కొన్ని నిమిషాల పాటు వేయించాలి. తరువాత అందులోనే మటన్ ముక్కలు వేసి మెత్తబడేదాకా ఉడికించాలి. అవసరమైతే మరికాస్త నీటిని కూడా పోసుకోవచ్చు.
చివరగా మామిడికాయ ముక్కలను మటన్‌కు కలిపి ఉడికించాలి. దింపడానికి ఒక నిమిషం ముందు పైన నూరి ఉంచుకున్న మసాలా పేస్ట్‌ను కలిపి, సన్నటి మంటమీద నూనె పైకి తేలేంతదాకా ఉడికించి, దించేయాలి. అంతే మ్యాంగో మటన్ రెడీ అయినట్లే...! దీన్ని వేడి వేడి అన్నంలోకి, చపాతీల్లోకీ, పరోటాల్లోకి సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.