Publish Date: Fri, 09 Jan 2009 (11:11 IST)
Updated Date: Fri, 09 Jan 2009 (11:10 IST)
కావలసిన పదార్థాలు :
ఎముకలు లేని చికెన్... అరకేజీ
నిమ్మరసం... నాలుగు టీస్పూన్లు
అల్లం రసం... మూడు టీస్పూన్లు
తెల్ల మిరియాలపొడి... అర టీస్పూన్
ఉప్పు... సరిపడా
జాజికాయ, జాపత్రి పొడి... అర టీస్పూన్
క్యాప్సికమ్... మూడు
టొమోటో... ఐదు
చాట్ మసాలా... ఒక టీస్పూన్
కారం... అర టీస్పూన్
జీలకర్ర పొడి... అర టీస్పూన్
వడగట్టిన పెరుగు... ఒకటిన్నర కప్పు
తయారీ విధానం :
చికెన్ ముక్కల్ని కడిగి... నిమ్మరసం, అల్లం రసం, ఉప్పు వేసి బాగా కలిపి పావుగంటసేపు నానబెట్టాలి. ఒక బౌల్‌లో పెరుగు, జాజికాయ, జాపత్రి పొడి, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు పట్టించాలి.
ఇప్పుడు క్యాప్సికమ్, టొమోటోలను కూడా పెద్ద ముక్కలుగా కోసి చికెన్ ముక్కల్లో కలిపి 15 నిమిషాలపాటు నానబెట్టాలి.
చివరిగా, ఒక ఇనుప చువ్వకు చికెన్, క్యాప్సికమ్, టొమోటో ముక్కలను కలిపి గుచ్చి... నిప్పుల మీద ఓ పది నిమిషాలు కాల్చి, తీసి వేడి వేడిగా పుదీనా చట్నీతో కలిపి వడ్డించండి.