Publish Date: Fri, 09 Jan 2009 (11:12 IST)
Updated Date: Fri, 09 Jan 2009 (11:12 IST)
కావలసిన పదార్థాలు :
చికెన్... ఒక కేజీ
కారంపొడి... రెండున్నర టీస్పూన్లు
పచ్చిమిర్చి... ఆరు
వెల్లుల్లి... రెండు
జీలకర్ర పొడి... ఒక టీస్పూన్
ఉల్లిపాయ... పెద్దది ఒకటి
కార్న్‌ఫ్లోర్... రెండు టీస్పూన్లు
పుల్లటి మీగడ... అరకప్పు
నీరు... తగినంత
ఉప్పు, నూనె... సరిపడా
తయారీ విధానం :
చికెన్‌కు కారం, జీలకర్రపొడి, ఉప్పు కలిపి పట్టించాలి. పాన్‌లో నూనె వేడిచేసి చికెన్‌ను కొద్ది వేయించి, వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిర్చి కలపాలి. కొద్దిగా నీరు పోసి మూతపెట్టి, కాసేపు మగ్గనివ్వాలి.
తరువాత చికెన్‌ను విడిగా తీసి, నెమ్మదిగా ఒత్తుతూ, కూరలోని జ్యూస్‌నంతా తీసివేయాలి. ఈ కూర జ్యూస్‌ను పాన్‌లో పోసి, కార్న్‌ఫ్లోర్ కలిపి సన్నటి మంటపై ఉడికించాలి. ఉడుకుతుండగా ఆ మిశ్రమాన్ని కలుపుతూ చిక్కబడేదాకా ఉంచి, చివర్లో మీగడ కలపాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని చికెన్‌పై పోయాలి. అంతే మిర్చి చికెన్ రెడీ అయినట్లే...! దీన్ని అన్నం బిర్యానీ, చపాతీ, పరోటాలలోకి సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.