Article Non Vegetarian %e0%b0%ae%e0%b0%b7%e0%b1%8d%e0%b0%b0%e0%b1%82%e0%b0%ae%e0%b1%8d %e0%b0%9a%e0%b0%bf%e0%b0%95%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d 108100700032_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మష్రూమ్ చికెన్

Advertiesment
వంటకాలు మాంసాహారం కోడిమాంసం లివర్ మష్రూమ్స్ పుట్టగొడుగులు చికెన్ వెన్న ఉల్లిపాయ బ్రెడ్ ముక్కలపొడి నెయ్యి ఆరు
FileFILE
కావలసిన పదార్థాలు :
కోడిమాంసం... ఒక కేజీ (మొత్తం కోడి)
కోడి లివర్... మూడు
మష్రూమ్స్ (పుట్టగొడుగులు)... పావు కేజీ
వెన్న... నాలుగు టీస్పూన్లు
ఉల్లిపాయ... పెద్దది ఒకటి
బ్రెడ్ ముక్కల పొడి... తగినంత
కార్న్‌ఫ్లోర్... అరకప్పు
గ్రుడ్డు... ఒకటి
నెయ్యి... తగినంత
జీడిపప్పులు... ఆరు

తయారీ విధానం :
చికెన్‌ను శుభ్రం చేసి, జాయింట్లు తీసి బ్రెస్ట్ భాగాన్ని పక్కన పెట్టుకోవాలి. మిగితా చికెన్‌ను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక పాన్‌లో వెన్నను కరిగించి, అందులో ఉల్లిపాయముక్కలు వేసి, కాసేపు వేగిన తరువాత... చికెన్, మష్రూమ్ ముక్కలను వేసి వేయించాలి.

లివర్ ముక్కలను వేడినీటిలో ఉంచి, తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి చికెన్‌కు కలపాలి. చికెన్ బ్రెస్ట్ పీసులను పల్చటి ముక్కలుగా కోసి పైన తయారు చేసిన చికెన్ మిశ్రమాన్ని వాటిమీద పరచి రోల్ చేసి దారంతో కట్టాలి. ఈ రోల్స్‌కు కార్న్‌ఫ్లోర్ పట్టించి, గ్రుడ్డు సొనలో ముంచి, బ్రెడ్ పొడి అద్దాలి.

ఒక బాణలిలో నెయ్యి వేడిచేసి, అందులో పైన చుట్టి ఉంచుకున్న రోల్స్‌ను వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీయాలి. అలా మొత్తం రోల్స్‌ వేయించిన తరువాత తీసి సర్వింగ్‌ డిష్‌లో ఉంచి పైన వేయించిన జీడిపప్పులతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే మష్రూమ్ చికెన్ రెడీ అయినట్లే...!

Share this Story:

Follow Webdunia telugu