Publish Date: Fri, 04 Apr 2008 (14:31 IST)
Updated Date: Fri, 04 Apr 2008 (14:31 IST)
కావలసిన పదార్థాలు :
సన్నగా తరిగిన బటన్ మష్రూంలు - నాలుగు టేబుల్ స్పూన్లు, కోడిగుడ్లు - నాలుగు, తరిగిన ఉల్లి ముక్కలు - ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి- ఒకటి, మిరియాల పొడి - మూడు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము - కాస్త, ఉప్పు - తగినంత, నూనె - మూడు టేబుల్ స్పూన్లు.
తయారు చేయు విధానం :
బాణాలిలో చెంచా నూనె వేసి కాగాక, అందులో బటన్ మష్రూం ముక్కలను వేసి వేగాక దించేయండి. కోడిగుడ్డును పగులగొట్టి దీనిని కాస్త గిలకొట్టి ఇందులో ఉల్లి, పచ్చిమిర్చి, మిరియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పులను వేసి కలపాలి.
తర్వాత పెనాన్ని పొయ్యి మీద పెట్టి కాలాక, దానిపై నూనె రాసి తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి దానిపైన వేయించి పెట్టుకున్న బటన్ మష్రూం ముక్కలను వేసి ఉడికించాలి. రెండు వైపులా కాల్చి దించి వేడిగా సర్వ్ చేయండి.