కావలసిన పదార్థాలు :
పెద్దసైజు రొయ్యలు... అర కేజీ
ఉల్లిపాయ.... పెద్దది ఒకటి
కరివేపాకు పొడి... రెండు టీ.
లవంగాలు... నాలుగు
చెక్క... ఒకటి
షాజీరా... అర టీ.
మిరియాలపొడి... ఒక టీ.
మీగడ... ఒక కప్పు
నెయ్యి... రెండు టీ.
ఉప్పు... తగినంత
కొత్తిమీర... సరిపడా
బిరియానీ ఆకు... ఒకటి
తయారీ విధానం :
ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడయ్యాక... బిరియానీ ఆకు, షాజీరా, లవంగాలు, చెక్కను వేసి కాసేపు వేయించాలి. దీనికి ఉల్లిపాయ ముక్కలు, మిరియాలపొడిని కూడా కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న రొయ్యలను కలిపి, అవి పింక్ కలర్‌లోకి వచ్చేదాకా వేయించాలి.
తరువాత అందులో మీగడ వేసి కలియదిప్పుతూ వేగనివ్వాలి. ఆపై ఉప్పు, కరివేపాకు పొడి చల్లి మరో నిమిషంపాటు వేయించాలి. రొయ్యలు ఉడికాక స్టవ్ మీదినుంచి దించాక... పైన కొత్తిమీర చల్లి వేడి వేడిగా సర్వ్ చేయాలి. తమిళ ప్రజలు చాలా ఇష్టంగా తినే ఈ వంటకాన్ని మీరూ ట్రై చేయండి మరి...!