Publish Date: Fri, 23 Jan 2009 (20:18 IST)
Updated Date: Fri, 23 Jan 2009 (20:18 IST)
కావలసిన పదార్థాలు :
మాంసం... అరకేజీ
సెనగపప్పు... వంద గ్రాములు
బియ్యం... వంద గ్రాములు
గోధుమరవ్వ... వంద గ్రాములు
పచ్చిమిర్చి... ఎనిమిది
ఉల్లిపాయలు... 300 గ్రాములు
పెరుగు... ఒకటిన్నర కప్పు
వెన్న... ఏడు టీస్పూన్లు
గరంమసాలా... ఒక టీస్పూన్
కారం పొడి... సరిపడా
పుదీనా... తగినంత
కొత్తిమీర... తగినంత
నిమ్మకాయలు... మూడు
నూనె... వేయించేందుకు సరిపడా
అల్లంవెల్లుల్లి ముద్ద... ఒకటిన్నర టీస్పూన్
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
ఒక బాణలిలో నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించి తీయాలి. అదే బాణలిలో నూనె వంపేసి కొద్దిగా ఉంచుకుని అందులో మాంసం ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, గరంమసాలా, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. పెరుగుకూడా మాంసానికి పట్టించి మెత్తగా అయ్యేదాకా సన్నని మంటమీద ఉడికించాలి.
తరువాత అందులోనే 6 గ్లాసుల నీరు పోసి.. బియ్యం, గోధుమరవ్వ, సెనగపప్పు, పెసరప్పు కూడా వేసి బాగా ఉడికించాలి. ఇందులోనే వెన్నను కలపాలి. చివరగా ఉప్పు సరిజూసి పప్పురుబ్బే కట్టెతో మెత్తగా మెదుపుకోవాలి. ఇపుడు దీనిమీద వేయించిన ఉల్లిముక్కలు, నిమ్మరసం వేసి కలపాలి. చివరగా పుదీనా, కొత్తిమీర చల్లి వేడి వేడిగా అతిథులకు వడ్డించాలి.