Article Non Vegetarian %e0%b0%ae%e0%b0%9f%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c %e0%b0%9f%e0%b0%ae%e0%b1%8b%e0%b0%9f%e0%b0%be %e0%b0%ae%e0%b0%b8%e0%b0%be%e0%b0%b2%e0%b0%be 109081400099_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మటన్‌ టమోటా మసాలా

Advertiesment
వంటకాలు
FILE
కావలసిన పదార్థాలు :
మటన్.. అర కేజి
ఎసరునీరు.. అర లీ.
నూనె.. కప్పు
టొమాటో గుజ్జు.. 2 కప్పులు
పచ్చికొబ్బరి ముద్ద.. 2 టీ.
నిమ్మరసం.. ఒక టీ.
పచ్చిమిర్చి ముద్ద.. ఒక టీ.
గసాల, ఉల్లి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, కారం.. రెండేసి టీ.
ధనియాలు, గరం మసాలా పొడి.. చెరో టీ.
ఆరెంజ్‌ రెడ్‌ ఫుడ్‌ కలర్‌.. పావు టీ.
ఉప్పు: తగినంత,

తయారీ విధానం :
ముందుగా పసుపు, టీస్పూను అల్లం-వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్ద, అరటీస్పూను ఉప్పు వేసి మాంసం ముక్కలకు పట్టించి ఓ గిన్నెలో ఈ మిశ్రమాన్ని తీసుకుని కుక్కర్‌లో 15 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత స్టౌమీద పాన్‌ను ఉంచి నూనె పోసి వేడయ్యాక, ఉల్లిముద్ద వేసి దోరగా వేయించాలి. ఉల్లి, అల్లం వెల్లుల్లి ముద్దలను చేర్చి బాగా వేపాలి.

ఆపై కారం, ధనియా, మసాలా పొడులు, మాంసం ముక్కల్ని కలిపి.. కాసేపు వేయించి, సరిపడా ఉప్పు కలపాలి. అందులోనే టమోటో గుజ్జు, కొబ్బరి, గసాల ముద్దలు వేసి కలపాలి. ఈ మిశ్రమానికి తగిన పాళ్లు ఎసరునీళ్లు పోసి మూత పెట్టి మాంసం ముక్కలు ఉడికి గ్రేవీ వచ్చేంతవరకు ఉడికించాలి. అంతే మటన్ టమోటా మసాలా రెడీ..! ఈ మటన్ మసాలాను అన్నం, రోటీలకు సైడిష్‌గా వాడుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu