Article Non Vegetarian %e0%b0%ae%e0%b0%9f%e0%b0%a8%e0%b1%8d %e0%b0%ae%e0%b1%80%e0%b0%97%e0%b0%a1 %e0%b0%95%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be 109100300133_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మటన్ మీగడ కుర్మా

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
మటన్.. ఒక కేజీ
చిక్కటి మీగడ పెరుగు.. 3 టీ.
నిమ్మరసం.. 2 టీ.
యాలకుల పొడి.. అర టీ.
అల్లం, వెల్లుల్లి పేస్ట్.. 3 టీ.
గరంమసాలా.. 4 టీ.
నెయ్యి.. ఒక టీ.
జీలకర్.. 1 టీ.
ఉల్లిపాయలు.. రెండు
కొత్తిమీర.. తగినంత
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
మటన్ ముక్కలకు ఉప్పు, నిమ్మరసం అల్లం, వెల్లుల్లి పేస్ట్, పెరుగు, మీగడ, యాలకుల పొడి కలిపి పట్టించి రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. లోతు ఎక్కువగా ఉన్న పాన్‌లో నెయ్యి వేడి చేసి, జీలకర్ర వేసి.. చిట్లిన తరువాత ఉల్లిముక్కలను వేయించాలి. దీనికి మటన్ ముక్కల్ని కలిపి.. మూతపెట్టి సిమ్‌లో ఉడికించాలి.

ఉడికిన తరువాత గరంమసాలా, కొత్తిమీరలను వేసి మరో 20 నిమిషాలపాటు మీడియం మంటమీద ఉడికించాలి. కూరను దించేసి కొద్దిగా మీగడను కూరపై పోయాలి. అంతే ఘుమఘుమలాడే మటన్ మీగడ కుర్మా రెడీ..! కూర కాస్త ఘాటుగా ఉండాలనుకునేవారు మసాలాలను మోతాదు ఇంకాస్త పెంచుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu