"మటన్ చట్నీ"తో మజా మజా..!!
కావలసిన పదార్థాలు :బోన్‌లెస్ మటన్... అర కేజీటొమోటోలు... మూడుఉల్లిపాయలు... రెండుఅల్లంవెల్లుల్లి పేస్ట్... రెండు టీ.పసుపు... ఒక టీ.కారం... 3 టీ.నూనె.. అర కప్పునిమ్మకాయలు... రెండుఉప్పు... తగినంతపోపుకోసం...ఎండుమిర్చి...4జీలకర్ర... ఒక టీ.కరివేపాకు... రెండు కట్టలునూనె... రెండు టీ.తయారీ విధానం :ప్రెషర్‌కుక్కర్‌లో మటన్ వేసి చిటికెడు పసుపు, కాస్తంత ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. మాంసం ఉడికాక మిగిలిన నీటిని పూర్తిగా వంపేయాలి. మటన్‌ను పప్పుగుత్తితో మెత్తగా మెదపాలి. కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. ఆపై అల్లంవెల్లుల్లి వేసి మిగిలిన పసుపు, కారం, ఉప్పు వేయాలి.ఇప్పుడు సన్నగా తరిగిన టొమాటో ముక్కల్ని అందులో వేసి ఐదునిమిషాలు ఉడికించాలి. తరువాత మెదిపిన మటన్ వేసి బాగా కలిపి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి బాగా ఇగిరిపోయేదాకా ఉడికించాలి. విడిగా మరో బాణలిలో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు చేసి ఈ మటన్ కూరలో కలిపితే మటన్ చట్నీ తయార్. చివర్లో నిమ్మరసం పిండి వడ్డించాలి.