కావలసిన పదార్థాలు :
మటన్ కైమా... పావుకేజీ
సన్‌ఫ్లవర్ ఆయిల్... వంద గ్రా.
జీడిపప్పు... పది గ్రా.
పచ్చిమిర్చి... నాలుగు
శనగపప్పు... 30 గ్రా.
గరంమసాలా...50 గ్రా.
పెరుగు... ఒక కప్పు
ఉల్లిపాయ... ఒకటి
కొత్తిమీర, పుదీనా తరుగు... ఒక కప్పు
నెయ్యి... రెండు టీ.
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
ముందుగా పెరుగును సన్నటి గుడ్డలో కట్టి పక్కన పెట్టుకోవాలి. మటన్ కైమా, శనగపప్పు, గరంమసాలా, కొత్తిమీర, పుదీనాలకు తగినంత ఉప్పును కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వడగట్టిన పెరుగు ముద్దలను కూడా మెత్తగా రుబ్బి, మటన్ కైమా మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మసాలా వడల్లాగా తయారుచేసి.. స్టవ్‌పై నాన్‌స్టిక్ పాన్ పెట్టి, వేడయ్యాక నెయ్యి లేదా నూనెతో వడలను, ఫిష్ ఫ్రై చేసినట్లుగా రెండువైపులా బంగారు వర్ణం వచ్చేదాకా వేయించాలి.
అంతే మటన్ కైమా షెమీ కబాబ్ రెడీ అయినట్లే...! వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే గ్రీన్ చట్నీతోగానీ, చిల్లీసాస్ లేదా టమోటో సాస్‌తోగానీ కలిపి తింటే రుచి అదిరిపోతుంది.