కావలసిన పదార్థాలు :
మటన్ కీమా... అరకేజీ
నెయ్యి... వంద గ్రా.
బొంబాయి రవ్వ... అరకేజీ
ఉప్పు... తగినంత
వంటసోడా... చిటికెడు
ఉల్లిపాయలు... మూడు
కారం... ఒక టీ.
అల్లం వెల్లుల్లి ముద్ద... ఒక టీ.
నిమ్మరసం... ఒక టీ.
కొత్తిమీర... రెండు కట్టలు
నూనె... ఐదు టీ.
ధనియాలపొడి... ఒక టీ.
గరంమసాలా... ఒక టీ.
నూనె... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం :
బొంబాయిరవ్వను నేతితో కలియబెట్టి ఉప్పు, వంటసోడా వేసి కొన్ని నీళ్లు చల్లి ముద్దలా కలపాలి. దీన్ని పన్నెండు ముద్దలుగా విడదీసి తడి వస్త్రంతో కప్పి ఉంచాలి. మటన్‌కీమాను ఉడికించి పక్కన ఉంచాలి. ఓ బాణలిలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించి అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, ధనియాలపొడి, ఉప్పు కలిపి... కీమా కూడా కలిపి పొడిపొడిగా వేయించాలి.
దీన్ని ఓ గిన్నెలోకి తీసి నిమ్మరసం, కొత్తిమీర చేర్చాలి. ఇప్పుడు పిండిముద్దను పలచగా వత్తి.. కీమా కూరను దాని మధ్యలో ఉంచి అన్ని వైపులా మూసేసి దగ్గరగా చేసి, కోడిగుడ్డు ఆకారంలో చుట్టి కాస్త చేత్తో వత్తాలి. వీటిని బాగా కాగుతున్న నూనెలో వేసి సన్నని మంటపై బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తీసేయాలి. వీటిని వేడి వేడిగా, పుదీనాచట్నీతో వడ్డించాలి.