Publish Date: Thu, 07 Aug 2008 (16:58 IST)
Updated Date: Thu, 07 Aug 2008 (16:57 IST)
కావలసిన పదార్థాలు :
కోడిగుడ్లు.... ఐదు
ఉప్పు... ఒక టీస్పూన్
మిరియాలు... అర టీస్పూన్
కోఫ్తాల తయారీకి...
బంగాళాదుంపలు... నాలుగు
క్యారెట్లు... రెండు
బీన్స్... పదిహేను
ఉల్లిపాయలు... రెండు
అల్లం... చిన్నముక్క
పచ్చిమిర్చి... నాలుగు
నిమ్మకాయ... ఒకటి
ఉప్పు... తగినంత
నూనె... వేయించేందుకు సరిపడా
కార్న్‌ఫ్లోర్... సరిపడా
తయారీ విధానం :
కోఫ్తాల కోసం బంగాళాదుంపలను ఉడికించి మెత్తగా ముద్ద చేసి ఉంచాలి. ఓ బాణలిలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లంముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
తరువాత అందులోనే క్యారెట్ తురుము, సన్నగా తరిగిన బీన్స్ ముక్కలను కలిపి మూడు నిమిషాలపాటు వేయించి, ఆపై బంగాళాదుంపల ముద్దను కూడా వేసి వేయించాలి. ఇందులోనే నిమ్మరసం, ఉప్పు వేసి దించి... చిన్న చిన్న ఉండలుగా చుట్టి కార్న్‌ఫ్లోర్‌లో దొర్లించాలి. తరువాత వీటిని నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసుకోవాలి.
ఒక గిన్నెకు అడుగున కొద్దిగా నూనె పూసి కోడిగుడ్ల సొన, ఉప్పు, మిరియాలపొడి వేసి గిలకొట్టాలి. ఇప్పుడు కోఫ్తాలు వేయించిన నూనె పాత్రలోనే నూనె కొద్దిగా ఉంచి, వేడిచేసి అందులో గుడ్డుసొన మిశ్రమాన్ని ఒక గరిటె వేసి, మధ్యలో కోఫ్తా ఉండను పెట్టాలి. ఎగ్ మిశ్రమం పక్కకు జరగకుండా జాగ్రత్తగా రౌండ్‌గా ఉండేలా గరిటెతో కదుపుతూ కాల్చాలి.
ఇలా మొత్తం కోఫ్తాలను గుడ్డుసొనతో కలిపి కాల్చిన తరువాత అందంగా అలంకరించి, స్నాక్స్ లాగా అతిథులకు వడ్డించండి.