కావలసిన పదార్థాలు :
పెంకు తీయని రొయ్యలు... ముప్పావు కేజీ
పండుమిర్చి... పదిహేను
అల్లం... 75 గ్రా.
వెల్లుల్లి రేకలు... వంద గ్రా.
ఉల్లిపాయలు... ఐదు
చింతపండు... జామకాయంత
నిమ్మకాయలు... రెండు
దాల్చినచెక్క... కాస్తంత
లవంగాలు... ఆరు
కరివేపాకు... రెండు కట్టలు
నూనె... సరిపడా
పంచదార... రెండు టీ.
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
ముందుగా రొయ్యల మీదున్న పెంకును తీసివేసి, కొద్దిగా ఉప్పువేసి నీళ్లలో శుభ్రం చేయాలి. తరువాత రొయ్యల్ని కొద్దిగా వేయించి పక్కన ఉంచాలి. ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పండుమిర్చి, చింతపండు కలిపి మెత్తగా నూరి పెట్టుకోవాలి. చెక్క, లవంగాలు వేయించి పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఓ బాణలి తీసుకుని, స్టవ్‌మీద పెట్టి నూనె పోసి కాగాక, ఉల్లిపాయముక్కలు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకూ వేయించాలి. తరవాత నూరిన అల్లంవెల్లుల్లి ముద్ద కూడా వేసి మరికాసేపు వేయించాలి. ఇప్పుడు రొయ్యలు కూడా వేసి, నీరంతా ఆవిరైపోయి నూనె తేలేవరకూ వేయించాలి. చివరగా కరివేపాకు, చెక్క, లవంగాల పొడి, ఉప్పు, పంచదార కూడా వేసి దించేయాలి. చల్లారిన తరవాత నిమ్మరసం పిండి సర్వ్ చేయాలి.