Publish Date: Fri, 23 Jan 2009 (20:19 IST)
Updated Date: Fri, 23 Jan 2009 (20:19 IST)
కావలసిన పదార్థాలు :
చేపలు... పావు కిలో
కోడి గుడ్డు.. ఒకటి
ఫిష్ పాక్... ఒక కప్పు
నిమ్మకాయ.. ఒకటి
బ్రెడ్ స్లయిస్‌లు... పన్నెండు
సెనగ పిండి... 100 గ్రాములు
ఉల్లిపాయ తరుగు... రెండు టీస్పూన్లు
మిరియాల పొడి... కొంచెం
నెయ్యి... 150 గ్రాములు
మీగడ... రెండు టీస్పూన్లు
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
బాణలిని వేడిచేసి అందులో ముళ్ళు తీసిన చేపల్ని వేసి, మెత్తగా మెదుపుకోవాలి. అందులో ఉల్లికాడల పేస్ట్‌ను కలిపి వేడిచేసిన వెన్నను వేయాలి. తరువాత అందులోనే సెనగపిండి, ఫిష్ స్టాక్‌ను పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. అలాగే తగినంత, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, మీగడలను కూడా పై మిశ్రమంలోనే కలుపుకోవాలి.
బాణలిని కిందికి దించి ఆ మిశ్రమాన్ని ఆరబెట్టి చిన్నచిన్న ఉండలుగా తయారు చేసి ప్లేటులో పెట్టుకోవాలి. మరో గిన్నెలో గుడ్లను గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ ముక్కల్ని పౌడర్‌లా చేసుకుని ప్లేట్‌లో ఉంచుకుని, పైన తయారు చేసిన బుల్లట్స్‌ను ఒకటొకటిగా గుడ్డుసొనలో ముంచి తీసి... బ్రెడ్ పౌడర్‌లో అద్ది, బ్రౌన్ కలర్ వచ్చేదాకా నేతిలో వేయించాలి. అంతే ఫిష్ బుల్లెట్స్ సిద్ధమైనట్లే... వీటిని టమోటో సాస్, చిల్లీ సాస్, గ్రీన్ చట్నీతో కలిపి సర్వ్ చేయవచ్చు.