Publish Date: Fri, 23 Jan 2009 (20:18 IST)
Updated Date: Fri, 23 Jan 2009 (20:18 IST)
కావలసిన పదార్థాలు :
పొట్టేలు తలకాయ మాంసం... ముప్పావు కేజీ
ఉల్లిపాయలు... మూడు
గసగసాలు... రెండు టీస్పూన్లు
పుచ్చకాయ గింజలు... రెండు టీస్పూన్లు
కాజు... మూడు టీస్పూన్లు
ధనియాలపొడి... రెండు టీస్పూన్లు
ఎండుకొబ్బరి... మూడు టీస్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్... మూడు టీస్పూన్లు
గరంమసాలా... ఒక టీస్పూన్
ఉప్పు... సరిపడా
నువ్వులు... రెండు టీస్పూన్లు
కొత్తిమీర తరుగు... కొద్దిగా
నూనె... తగినంత
తయారీ విధానం :
తలకాయ మాంసం ముక్కలను కొద్దిగా ధనియాలపొడి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాణలిలో నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి. దానికి కొద్దిగా నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి.
కాజు, గసగసాలు, పుచ్చకాయగింజలు, నువ్వులు, ఎండుకొబ్బరి కలిపి ముద్దగా నూరుకోవాలి. బాణలిలో నూనె వేసి ఉల్లిపాయముక్కలను ఫ్రై చేసుకోవాలి. దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరంమసాలా, ధనియాలపొడి, పసుపు, కారం, ఉప్పు కలిపి, కుక్కర్‌లో ఉడికించి పెట్టుకున్న మాంసం ముక్కలను కూడా కలపాలి.
బాగా వేగిన తరువాత వేడినీళ్లు పోసి ముక్కలు ఉడికేదాకా ఉంచాలి. ముక్కలు ఉడికి కూర కాస్తంత చిక్కబడిన తరువాత కొత్తిమీర తరుగుల్ని చల్లి దించేయాలి. దీన్ని వేడి వేడిగా సంగటి ముద్దతో కలిపి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. మీరూ ప్రయత్నించండి.