కావలసిన పదార్థాలు :
ఉడికించి మెత్తగా చేసిన బంగాళాదుంపలు... మూడు కప్పులు
కోడిగ్రుడ్లు... నాలుగు
నూనె... ముప్పావు కప్పు
ఉప్పు... తగినంత
కొత్తిమీర తురుము... ముప్పావు కప్పు
వేరుశెనగ పొడి... ముప్పావు కప్పు
పచ్చిమిర్చి ముద్ద... రెండు టీ.
అల్లంముద్ద... రెండు
కారం... ఒక టీ. జీలకర్ర పొడి... అర టీ.
మిరియాల పొడి... అర టీ.
కేసరి రంగు... చిటికెడు
తయారీ విధానం :
ఒక గిన్నెలో ముద్దగా చేసిన బంగాళాదుంపల్ని వేసి అందులో బాగా గిలకొట్టిన కోడిగుడ్డు సొన, కొత్తిమీర తురుము, వేరుశెనగ పొడి, పచ్చిమిర్చి ముద్ద, అల్లంముద్ద, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కేసరి రంగు వేసి స్పూన్‌తో బాగా గిలకొట్టాలి.
స్టవ్‌మీద ఓ పాన్ లేదా మూకుడు పెట్టి, కొద్దిగా నూనె వేసి... పైన కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్‌లాగా పోసి, మూతపెట్టాలి. దీన్ని సన్నసెగమీద మగ్గనిస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చాలి. చివరగా... దీన్ని చాకుతో ముక్కలుగా కోసి ఇస్తే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు.