కావలసిన పదార్థాలు :
మటన్ కీమా... ఒక కేజీ
సెనగపప్పు... 300 గ్రా.
గరంమసాలా... 4 టీస్పూన్లు
కొత్తిమీర... ఒక కట్ట
పుదీనా... ఒక కట్ట
పచ్చిబొప్పాయి... చిన్నముక్క
గుడ్లు... నాలుగు
కారం... ఒకటిన్నర టీ.
ఉప్పు... తగినంత
నూనె... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం :
గరంమసాలా, సెనగపప్పు, కీమా కలిపి కుక్కర్‌లో పెట్టి రెండు కూతలు వచ్చేవరకూ ఉడికించాలి. కారం, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, తురిమిన బొప్పాయి, గిలకొట్టిన కోడిగుడ్డు... అన్నీ ఉడికించిన కీమాలో కలపాలి. కీమా మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని అరచేతిలో వేళ్లతో వత్తి నూనెలో ఎర్రగా వేయించాలి.
అంతే పుదీనా మటన్ కబాబ్ రెడీ అయినట్లే...! నిమ్మరసం చల్లిన పచ్చి ఉల్లిపాయలు నంజుకుంటూ ఈ కీమా కబాబ్‌లను తింటే అద్భుతంగా ఉంటాయి. మీరూ ట్రై చేసి చూడండి మరి...!!