Article Non Vegetarian %e0%b0%a8%e0%b1%80%e0%b0%b2%e0%b0%97%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf %e0%b0%ae%e0%b0%9f%e0%b0%a8%e0%b1%8d %e0%b0%95%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be 109061300109_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీలగిరి మటన్ కుర్మా

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
మటన్... అర కేజీ
పచ్చిమిర్చి... నాలుగు
కొత్తిమీర... ఒక కట్ట
అల్లం... కాస్తంత
వెల్లుల్లి... రెండు రెబ్బలు
గసగసాలు... మూడు టీ.పెరుగు... రెండు కప్పులు
కొబ్బరి... కొద్దిగా
ఎండుమిర్చి... ఐదు
ధనియాలు... ఒక టీ.
గరంమసాలా... అర టీ.
ఉల్లిపాయలు... రెండు
నూనె... నాలుగు టీ.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
మాంసాన్ని కడిగి ముక్కలుగా చేసి పెరుగులో అరగంటసేపు నానబెట్టాలి. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లంవెల్లుల్లి, గసగసాలు, కొబ్బరి, ఎండుమిర్చి, ధనియాలు కలిపి మెత్తగా రుబ్బాలి. మిగిలిన ఉల్లిపాయను సన్నగా తరగాలి. ఓ బాణలిలో నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించాలి.

మెత్తగా గ్రైండ్‌ చేసిన మసాలా ముద్దను కూడా అందులో వేసి కొంచెంసేపు వేయించాలి. నానబెట్టిన మాంసం, పెరుగు, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి మాసం మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. చివర్లో గరంమసాలా పొడి చల్లి దించేయాలి. అంతే రుచికరమైన నీలగిరి మటన్ కుర్మా సిద్ధమైనట్లే...!

Share this Story:

Follow Webdunia telugu