Article Non Vegetarian %e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf %e0%b0%ac%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf 108070500037_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిజామి బిరియాని

Advertiesment
నిజామి బిరియాని
కావలసిన పదార్థాలు :

మటన్ పీసెస్ - అరకిలో
(ఉడికించినవి) బాస్మతిరైస్-2 కప్పులు
నెయ్యి-200 గ్రాములు
అల్లం పేస్టు-1 చెంచా
వెల్లుల్లి-6 గర్భాలు
అరెంజికలర్- చిటికెడు
ఎండుమిర్చి-8
దాల్చిన చెక్క-1 అంగుళం ముక్క
మిరియాలు-5
ఉప్పు-రుచికి సరిపడ
బంగాళదుంపలు-పావుకిలో
పెరుగు-250 గ్రాములు
ఉల్లిరసం-2 పాయలది
వెల్లుల్లి పేస్టు-1 చెంచా
సాఫ్రాన్-1/2 చెంచా
పాలు-1/4 కప్పు
పచ్చిమిర్చి-2
యాలకులు-3
కొత్తిమీర-1/2 కప్పు తరుగు

తయారీ విధానం:

ముందుగా బంగాళదుంపలు ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఉడికించి ఎర్రగా వేపి ఉంచాలి. ఉల్లిరసం తయారు చేసుకోవాలి. బాస్మతిరైస్‌తో అన్నం ఉడికించి 2 కప్పులు తీసుకోవాలి. మిక్సీలో దాల్చిన చెక్క, యాలకలు, లవంగాలు, మిరియాలు వేసి మెత్తగా పొడి చేసి ప్రక్కన పెట్టుకోవాలి. తరువాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉప్పు కలిపి మిక్సీ వేసి మెత్తగా పేస్టు చెయ్యాలి.

ఈ పేస్టును మటన్ ముక్కలకు పట్టించి గంటసేపు నానబెట్టాలి. నెయ్యి బాండీలో పోసి కాగిన తరువాత దాల్చిన చెక్కపొడి వేసి వాటికి మటన్ పీసెస్ కలిపి ఉడికించాలి. ముక్కలు ఉడికి నీరంతా ఇంకిపోయిన తరువాత ఉడికించిన అన్నం, వేసిన బంగాళాదుంప ముక్కలు వేసి బాగా కలపాలి. పాలు వేడి చేసి సాఫ్రాన్ కలర్‌ వేసి కలిపి వీటికి బిరియానిలో పోసి కలిపి 5 నిమిషాలు ఉడికించి కొత్తిమీర చల్లి దించుకోవాలి. గిన్నె మీద మూత పెట్టి పావుగంట తరువాత తీసివేసి వేడివేడిగా సర్వ్ చెయ్యాలి.

Share this Story:

Follow Webdunia telugu