కావలసిన పదార్థాలు :
నాటుకోడి... ఒక కేజీ
బాస్మతి బియ్యం... ఒక కేజీ
దాల్చినచెక్క... పది
లవంగాలు...20
యాలకులు... 2 టీ.
అనాసపువ్వు...నాలుగు
ఉల్లిపాయ తరుగు... అర కేజీ
టొమోటో తరుగు... అరకేజీ
పచ్చిమిర్చి... 50 గ్రా.
కొత్తిమీర తురుము... అరకప్పు
పుదీనా ఆకులు... అరకప్పు
నూనె... 200గ్రా.
నెయ్యి...100గ్రా.అల్లంవెల్లుల్లి ముద్ద.. 5 టీ.
పసుపు... 2 టీ.
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
బాస్మతి బియ్యం సగం ఉడికించి పక్కన ఉంచాలి. ప్రెషర్‌పాన్ లేదా కుక్కర్‌లో నూనె వేసి కాగాక లవంగాలు, యాలకులు, అనాసపువ్వు, దాల్చిన చెక్క అన్నీ వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద కూడా వేసి వేయించాలి. ఐదు నిమిషాల తరవాత టొమాటో ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసి ఉడికించాలి.
ఇప్పుడు చికెన్ ముక్కలు, పసుపు వేసి 2 లీటర్ల నీళ్లు పోసి ఉడికించాలి. చికెన్ ముక్కలు ఉడికిన తరవాత సగం ఉడికించి ఉంచిన అన్నం కూడా ముక్కల్లో వేసి ఉప్పు చల్లి మూతపెట్టి 30 నిమిషాలపాటు సిమ్‌లో ఉంచాలి. తరవాత నెయ్యి వేసి మరికాస్త కొత్తిమీరతో అలంకరిస్తే నాటుకోడి బిర్యానీ రెడీ అయినట్లే...!