Publish Date: Mon, 24 Mar 2008 (11:33 IST)
Updated Date: Mon, 24 Mar 2008 (11:32 IST)
కావలసిన పదార్థాలు :
మాంసం - అరకిలో, ఉల్లిపాయలు - నాలుగు(పెద్దవి), పచ్చిమిరపకాయలు - ఐదు, అల్లం - చిన్న ముక్క, ధనియాలు - ఐదు స్పూన్లు, దాల్చన చెక్క - రెండు స్పూన్లు, ములక్కాడలు - మూడు, లవంగాలు - మూడు, నూనె - వేయించడానికి సరిపడ, గసగసాలు - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత.
తయారు చేయు విధానం:
ముందుగా ములక్కాడలను కడిగి రెండు అంగుళాల సైజులో, ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. గసగసాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిపరకాయలను నూరుకోవాలి. మాంసాన్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. చెక్క, లవంగాలు, ధనియాలు, గసగసాలను వేడి చేసి పెట్టుకోవాలి.
మరో వైపు బాణాలిలో నూనె వేసి కాగాక అందులో ఉల్లిముక్కలను వేసి దోరగా వేయించాలి. తర్వాత లవంగాలు, దాల్చిన చెక్కలను వేసి కాసేపు వేయించాక ఇందులో మాంసం ముక్కలను వేయాలి. దీనిలో అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి సరిపడ ఉప్పును వేసి లీటరు నీళ్లను పోసి ఉడికించాలి.
మాంసం తినేలా ఉడికిన తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను వేయాలి. ములక్కాడ ఉడికి మాంసానికి పట్టేలా తిప్పి దీనిపై కొత్తిమీర కోరును జల్లి తీసేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.