Publish Date: Fri, 23 Jan 2009 (20:14 IST)
Updated Date: Fri, 23 Jan 2009 (20:13 IST)
పేరును బట్టి ఈ కూరకున్న స్పెషల్ ఏంటో తెలుస్తోంది కదూ...! తులసి ఆకులను మనవైపు పవిత్రంగా చూస్తారు. తులసి ఆకులతో చికెన్ కలిపి వండటం అనేది మన ప్రాంతాల్లో కనిపించదు. ఇది థాయ్‌లాండ్ వారి వంటకం. తయారు చేసుకోవడం కూడా సులభమే. మరి మీరూ ప్రయత్నిస్తారు కదూ...!
కావలసిన పదార్థాలు :
స్కిన్, బోన్ ఉన్న చికెన్ బ్రెస్ట్... ఒక కేజీ
తులసి ఆకులు... ఒక కప్పు
లవంగాలు, వెల్లుల్లి పేస్ట్... నాలుగు టీస్పూన్లు
ఉల్లిపాయలు... నాలుగు
ఫిష్ సాస్... రెండు టీస్పూన్లు
ఆయిల్... రెండు టీస్పూన్లు
మిరియాలు.. నాలుగు
ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
చికెన్ బ్రెస్ట్‌లను ఫ్రీజర్‌లో ఉంచి గట్టిపడేదాకా ఉంచాలి. గడ్డకట్టే వరకూ వరకు ఉంచకూడదు. ఆతర్వాత వాటిని బయటకు తీసి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి.
ఒక పాన్‌లో ఆయిల్ వేసి వేడైన తరువాత వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, ఉల్లిపాయల తరుగు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఆపై మిరియాలను కూడా కలిపి ఒక నిమిషంపాటు కలుపుతూ వేయించాలి.
పై మిశ్రమానికి చికెన్, సరిపడా ఉప్పును కలిపి ఉడికించాలి. చికెన్ కొద్దిగా ఉడికిన తరువాత తులసి ఆకులు, ఫిష్ సాస్ వేసి బాగా కలపాలి. ఉడికిన తరువాత దింపుకుని వేడివేడిగా అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.