Article Non Vegetarian %e0%b0%9c%e0%b1%86%e0%b0%82%e0%b0%97%e0%b0%be %e0%b0%ae%e0%b0%b2%e0%b1%88 %e0%b0%95%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80 109053000117_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జెంగా మలై కర్రీ

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
పచ్చిరొయ్యలు... ఒక కేజీ
ఉల్లిపాయలు... ఎనిమిది
అల్లం... పెద్దసైజు ముక్క
వెల్లుల్లి... 8 రెబ్బలు
టొమాటో ప్యూరీ... రెండు కప్పులు
జీడిపప్పుముద్ద... ఎనిమిది టీ.
పాలక్రీం... ఒక కప్పు
కారం... రెండు టీ.
కసూరి మేథీ... రెండు టీ.
నూనె... అర కప్పు
పచ్చిమిర్చి... పది
కొత్తిమీర... రెండు కట్టలు

తయారీ విధానం :
టొమాటోల్ని మెత్తని గుజ్జులా చేస్తే టొమోటో ప్యూరీ తయారవుతుంది, అలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిముక్కల్ని ముద్దలా నూరాలి. రొయ్యల్ని శుభ్రం చేసి కొంచెం ఉప్పు, కారం కలిపి ఉంచాలి. ఓ బాణలిలో నూనె పోసి కాగాక రొయ్యల్ని వేయించి తీసి పక్కనబెట్టాలి.

అదే నూనెలో ఉల్లిముద్ద వేసి వేయించాలి. సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరిగిన అల్లం, వెల్లుల్లిలను వేసి కాసేపు వేయించాలి. దాంట్లోనే కారం, పచ్చిమిర్చి, టొమాటో ప్యూరీ కలిపి గ్రేవీలా తయారు చేయాలి. ఇప్పుడు రొయ్యల్ని వేసి, ఉప్పు సరిచూసి జీడిపప్పు ముద్ద, గరంమసాలా, కసూరిమేథీ కలిపాలి. దించేముందు పాలక్రీం కలిపి దించి వడ్డించాలి.

Share this Story:

Follow Webdunia telugu