Article Non Vegetarian %e0%b0%9a%e0%b0%bf%e0%b0%95%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d %e0%b0%b0%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d 108082500086_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చికెన్ రోల్స్

Advertiesment
వంటకాలు మాంసాహారం చికెన్ తరుగు ఉల్లి ఉప్పు గోధుమపిండి మిరియాలపొడి
FileND
కావలసిన పదార్థాలు :
బోన్‌లెస్ చికెన్ జాయింట్స్... ఐదు
ఉల్లిపాయల తరుగు... ఆరు
ఉప్పు... సరిపడా
గోధుమపిండి... 15 టీస్పూన్లు
మిరియాలపొడి... కొద్దిగా
పుట్టగొడుగులు... 5 గ్రాములు (సన్నగా తరగాలి)
కోడిగుడ్డు... ఒకటి
టొమోటోలు... నాలుగు (ముక్కలు)
నూనె... సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్.. రెండు టీస్పూన్లు
వెన్న స్లైసులు... సరిపడా

తయారీ విధానం :
చికెన్ జాయింట్లను కడిగి వాటికి ఉప్పు, మిరియాలపొడి రాసి పక్కన పెట్టుకోవాలి. టొమోటోలను వేయించి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిముక్కలను టొమోటో, గోధుమపిండిని వేసి ఐదు నిమిషాలపాటు వేయించాలి. దీనిని చికెన్ జాయింట్స్‌ బాగా పట్టించి... ఒక ప్లేట్‌లో ఉంచి కోడిగ్రుడ్డును పగులగొట్టి, సొనను అన్ని జాయింట్లకు రాయాలి.

జాయింట్లను మిగిలిన తెల్లటి గోధుమపిండిలో పొర్లించి... నూనెలో వేసి బాగా ఎర్రగా వేయించాలి. తరువాత వీటిని కాసరోల్‌లో ఉంచి, పైన ఛీజ్ స్లైసెస్ ఉంచి ఉడికించాలి. ఛీజ్ కరిగేదాకా ఉడికించి వేడివేడిగా అతిథులకు అందించండి.

Share this Story:

Follow Webdunia telugu