Publish Date: Fri, 09 Jan 2009 (11:15 IST)
Updated Date: Fri, 09 Jan 2009 (11:15 IST)
కావలసిన పదార్థాలు :
ఎముకలు లేని చికెన్... అరకేజీ
ఆలివ్‌నూనె... ఒక టీస్పూన్
తరిగిన ఉల్లిపాయ... ఒకటి
తరిగిన వెల్లుల్లి... అర టీస్పూన్
మిరియాలపొడి... సరిపడా
ఉప్పు... తగినంత
రోటీలు... రెండు
ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లోని క్యాప్సికం... ఒక్కొక్కటి
తయారీ విధానం :
కడాయిలో నూనె వేడిచేసి, గుండ్రంగా తరిగిన క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి 5 నిమిషాలపాటు వేయించాలి. తరువాత చిన్న ముక్కలుగా తరిగిన చికెన్‌ను కూడా వేసి ఉడికించాలి. దించేముందు ఉప్పు, మిరియాల పొడి వేయాలి.
ఈ వేయించిన పదార్థాన్ని రోటీలలో సమానంగా పరుస్తూ రోల్స్‌లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పెనంపై కాస్తంత నూనె వేసి అటూ, ఇటూ తిప్పుతూ కాల్చుకోవాలి. అంతే చికెన్ రోటీ రోల్ సిద్ధమైనట్లే...! వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.