కావలసిన పదార్థాలు :
బోన్‌లెస్ చికెన్.. అర కేజీ
జీడిపప్పు.. పావు కప్పు
ఉల్లిపాయలు.. పావు కిలో
పచ్చిమిర్చి.. 10
ఎండుమిర్చి.. 6
అల్లం, వెల్లుల్లి పేస్ట్.. 2 టీ.
ధనియాలు.. 2 టీ.
జీలకర్ర.. ఒక టీ.
లవంగాలు.. నాలుగు
యాలకులు.. మూడు
దాల్చినచెక్క.. చిన్నది
ఉప్పు, నూనె.. తగినంత
తయారీ విధానం :
నూనె వేడి చేసి జీలకర్ర, ధనియాలు, యాలకులు , లవంగాలు, దాల్చినచెక్క, ఎండుమిర్చి, జీడిపప్పులను వేయించి తీయాలి. చల్లారిన తరువాత వీటికి, అల్లం వెల్లుల్లి,పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చికెన్, ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.