Publish Date: Sat, 09 Aug 2008 (16:40 IST)
Updated Date: Sat, 09 Aug 2008 (16:39 IST)
కావలసిన పదార్థాలు :
పులావు బియ్యం... అరకేజీ
కోడి మాంసం మెత్తటిది... అరకేజీ
వెల్లుల్లి... రెండు
గరంమసాలా... ఒకటిన్నర పాకెట్
ఉప్పు... సరిపడా
పసుపు... చిటికెడు
కారం... కొంచెం
నెయ్యి... 100 గ్రాములు
ఉల్లిపాయలు... ఆరు
పచ్చిమిర్చి... ఆరు
పెరుగు... రెండు కప్పులు
అల్లం... రెండు ముక్కలు
తయారీ విధానం :
పులావు బియ్యాన్ని రాళ్లు లేకుండా శుభ్రం చేసుకుని నానబెట్టి ఉంచుకోవాలి. కోడిమాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచాలి. ఒక బాణలిలో నూనె వేసి బాగా కాగిన తరువాత ఉల్లిపాయలు వేసి వేయించాలి. పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలియబెట్టి కొంచెం ఉడికిన తరువాత... మాంసం ముక్కల్ని వేసి ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికిన తరువాత పెరుగు, కొత్తిమీర వేసి దింపేయాలి.
వేరే గిన్నెలో నీళ్లుపెట్టి తెర్లుతున్నప్పుడు నానబెట్టి ఉంచుకున్న పులావు బియ్యాన్ని వేసి ఉడికించాలి. ముప్పావు భాగం ఉడికిన తరువాత అందులోని గంజిని వార్చేసి ముందే సిద్ధం చేసుకున్న మసాలాలను కలపాలి. నెయ్యికూడా కలిపి బాగా మగ్గనివ్వాలి. పొడిపొడిగా అన్నం తయారైన తరువాత దించేయాలి. తరువాత ఈ అన్నంలో పైన చికెన్‌తో తయారుచేసుకున్న పదార్థాన్ని కలపాలి. అంతే ఘుమఘుమలాడే చికెన్ ఫ్రైడ్‌రైస్ రెడీ.