Publish Date: Sat, 05 Jul 2008 (18:50 IST)
Updated Date: Sat, 05 Jul 2008 (18:50 IST)
కావలసిన పదార్థాలు:
చికెన్ జాయింట్స్- ఒక కిలో
వెల్లుల్లిపాయ- ఒకటి
ఉల్లిపాయలు- నాలుగు
కొత్తిమిర- ఒక కట్ట
తాలింపులు- కొంచెం
బంగాళదుంపలు- అరకిలో
కొబ్బరికాయ- ఒకటి
అల్లం- చిన్నముక్క
కరివేపాకు-కొంచెం
నూనె- 100 గ్రాములు
ఆవాలు- ఒకస్పూను
వేపిన ధనియాలు- రెండు స్పూనులు
ఎండుమిర్చి- నాలుగు
యాలకులు- నాలుగు
మిరియాలు- ఆరు
పసుపు- అరస్పూను
నెయ్యి- 50 గ్రాములు
తయారీ విధానం :
చికెన్ జాయింట్స్‌ను తెచ్చుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ధనియాలు - ఎండుమిర్చి - యాలకులు - మిరియాలు - పసుపు - పోపు మెత్తగా, ముద్దగా నూరుకోవాలి. వెల్లుల్లి నూరుకోవాలి. ఉల్లిపాయలు ముక్కలు చేసుకుని రెండు భాగాలు చేసుకుని వేర్వేరు చోట్ల పెట్టుకోవాలి. బంగాళాదుంపల్ని సన్నగా తరిగిపెట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టి - కోరి మూడు రకాలుగా పాలుతీసి ఉంచుకోవాలి. అల్లం సన్నగా తరగాలి. కరివేపాకు తురుముకుని ఉంచుకోవాలి.
నూనెను మరిగించి కాసిని ఆవాలు వేడిచేసి వెల్లుల్లి రెబ్బలు వేసి - మసాలా ముద్ద కలిపి చికెన్ జాయింట్స్ ఒక కప్పు ఉల్లిముక్కలు - కరివేపాకు వేసి ఉప్పు చల్లి మూతపెట్టి ఉడగ్గానే పల్చటి కొబ్బరిపాలు - బంగాళ దుంపల పీసులు అల్లం తురుము వెయ్యాలి. దుంప ఒక మాదిరిగా ఉడికాక ఓ పాటి చిక్కటి పాలు పోసి గ్రేవీ చిక్కబడ్డాక - చిక్కటి కొబ్బరిపాలు పోసి ఉడికించి దింపాలి. చెక్క, లవంగాలు చితగ్గొట్టి - నేతిలోవేసి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బ్రౌన్ కలర్‌లో వేపాక మొత్తం కూరలో కలుపుకోవాలి. అంతే చికెన్ జాయింట్ రెడీ.